హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి



హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 



తమ కలం, గళం ద్వారా సమాజానికి చైతన్యాన్ని అందించడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం ద్వారా సందేశాన్ని ఇచ్చారు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పోరాటంలో అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం ఉంటుందని నేను మాట్లాడారు..

 సాయుధ రైతాంగ పోరాటం, తొలి , మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా చర్రిత కొంత వక్రీకరణకు గురైంది..


తెలంగాణ ఉద్యమంలో సమిదలైన వారి కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారికే ఎక్కువ పేరు వచ్చింది..


తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో చేసిన వారి పేర్లు చరిత్రలో ఉండాలి..


చదివిన పుస్తకాలు, చైతన్య పర్చిన గానం నుంచి క్రోడీకరించి నేను ఉమ్మడి ఎపీ అసెంబ్లీలో  తెలంగాణ బిల్లు పైన మాట్లాడాను.. 



సాంకేతిక పరిజ్జానం పెరగడంతో డిజిటల్ మీడియా కారణంగా పుస్తకాల ప్రాధాన్యత తగ్గిపోతోంది.. 


హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను  నిర్వహించడం ద్వారా వచ్చే తరానికి స్పూర్తిని స్తున్నారు..


చరిత్ర చదువుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం..


హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది.. 

మంచి సందేశం ఇవ్వడం కోసమే 
బుక్ ఫెయిర్ లో నేను, మా మంత్రులు  పాల్గొన్నాం..


సామాజిక చైతన్యం , సమాజంలో వచ్చే మార్పుల పై చర్చించడానికి  బుక్ ఫెయిర్ మంచి వేదిక గా ఉంటుంది..


కొత్త తరానికి తెలిసింది గూగుల్ మాత్రమే.. 


చరిత్రకారులు రాసిన  పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన వారికి చరిత్ర తెలుస్తుంది.. 


పోరాడి అమరులైన వారి గురించి చరిత్ర కారులు రాస్తేనే తెలుస్తుంది.. 


తమకనుకూలంగా రాయించుకున్న చరిత్ర నే అసలైన చరిత్ర అని గత పదేళ్ల నుంచి కొందరు ప్రచారం చేయించుకుంటున్నారు.. 


చరిత్రకారులను గుర్తించుకోవడం కోసమే  తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం.. 


కాళోజీ, దాశరథి లాంటి కవులెందరో తెలంగాణ తొలి ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారు..


అందె శ్రీ, గూడ అంజయ్య, గద్దర్ లాంటి వారు మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారు.. 


నిజమైన చరిత్రను తెలియజేయడానికి ఏర్పాటైన పుసక్త ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు