ప్రభువా..నీవు చూపిన దారిలో

 


*_ప్రభువా.._*

*_నీవు చూపిన దారిలో..!_*

†††††††††††††††††††

ఇది శుభోదయం 

క్రీస్తు జన్మదినం..

ఇది లోకకళ్యాణం

మేరి పుణ్యదినం..!


జగతిని ఉద్దరించే శాంతిదూత

తన గర్భాలయంలో ఉద్భవిస్తే పులకించదా

మేరి మాత..!


లోకరక్షణే ధ్యేయమై..

అసూయాద్వేషాలు హేయమై..

శాంతి వచనాలే ప్రియమై

దివ్యలోకాల నుంచి

అరుదెంచిన ప్రేమమూర్తి..

అతడేగా సృష్టిలోన

అనంత కీర్తి..

మానవతకే స్ఫూర్తి..!


రాజులనేలే రారాజైనా

పశువుల పాకలో జననం..

ఆయన పుట్టుకే 

శాంతికి మహోదయం...

యేసు జీవితమే 

ప్రేమసందేశం..

మానవాళికి మార్గనిర్దేశం!


బాధను దిగమింగుతూ

నవ్వును పంచిన దేవదూత..

మరణాన్నీ అదే నవ్వుతో

స్వాగతించిన సహనశీలి

తాను శిలువై..

మన మనసుల్లో 

ఎప్పటికీ కొలువై..!


విశ్వశాంతి కోసం 

రక్తం చిందించిన క్రీస్తు..

ఊపిరి విడిచి 

మూడు రోజుల్లో

తిరిగొచ్చి తిరుగులేని దైవమై

ప్రపంచమే పరవశమై..

తన వశమై..!


క్రీస్తు పూర్వం..

క్రీస్తు శకం..

ఈ లోకం 

నీ ప్రేమవాచకం..

నీ నిర్మల వదనం..

నీ ప్రతి చర్చి 

ప్రశాంత సదనం..

నడిపించే నీ శాంతి సందేశం..

నీ పలుకు 

దేవదేవుని ఆదేశం!


ఓ ప్రభువా...

నిను దలచి..

ప్రతి పొద్దు నిను కొలిచి..

నీ సేవలో తరించి..

జరిగే ప్రతి మంచిలో

నిను దర్శించి..

నీ మార్గం అనుసరించి

నడిచే నీ అనుచరులం..

నిరంతర సేవకులం..

మము గాచుచు నీవుండగా

ఇక మాకు చింత ఏల..

నువ్వు చూపిన బాట..

మా బ్రతుకున 

ఆనందాల పూదోట...!


************************


_*క్రిస్మస్ శుభాకాంక్షలతో..*_


 *_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*

        9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు