10వ సారి రక్తదానం చేసిన ఈ.వి. సాత్విక

 


*10వ సారి రక్తదానం చేసిన ఈ.వి.  సాత్విక*

హనుమకొండ, డిసెంబర్ 30:

యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ ఈ.వి. సాత్విక (ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పీజీ పూర్తి) తలసేమియా పిల్లలకోసం తన పుట్టినరోజు పురస్కరించుకొని హనుమకొండ *ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ లో 10వ సారి రక్తదానం చేశారు.*


ఆ సందర్భంగా రక్తదానం అనంతరం అక్కడే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి మిఠాయి అందజేషీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు 


కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ,

“రెడ్ క్రాస్ సొసైటీ ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంచుతూ యువత రక్తదాన సేవలో భాగస్వాములయ్యేలా  ప్రోత్సహిస్తోంది” అన్నారు.


ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ, “మా నాన్న ఈ.వి. శ్రీనివాస్ రావు సమాజసేవలో  యువత ముందుకు రావాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఆయన ప్రేరణతోనే నేను కూడా రక్తదానం మరియు సామాజిక సేవ చేస్తున్నాను” అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, ట్రెజరర్ బి. పాపిరెడ్డి, పుల్లూరు వేణుగోపాల్ , రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు ఎం డి నేహాల్ , రజనీకాంత్ రవీందర్, రాజు, శివ తదితరులు పాల్గొని సాత్వికకు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు