ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలలో బుధవారం ఉదయం భూమి కంపించింది.
ఏంజరుగుతోందో అర్ధం కాక భయంతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రకంపనలు అర్ధం కాక గందరగోళానికి గురయ్యారు.
క్షణాల్లో భూకంప ప్రకంపనల వార్తలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నారు.తమ అనుభూతులు వ్యక్త పరిచి భూకంపాల గురించి చెప్పుకున్నారు. ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
దక్షిణ భారత దేశంలో మహారాష్ట్ర,ఒరిస్సా, ఛత్తిస్ ఘడ్ రాష్ట్రాలలో భూప్రకంపనలు నమోదయ్యాయి.
సుంకరి సంపత్ రావు జర్నలిస్ట్ ములుగు
1969 లో నేను మూడవ తరగతి చదువుతున్న రోజుల్లో బహుశా మార్చ్ ఏప్రిల్ నెలలో రాత్రి 8 గంటల సమయంలో mulugu లో భూకంపం సంభవించింది.... మా నాన్న మా ముగ్గురు అన్నా తమ్ముళ్ళను అమాంతం ఒక్కసారిగా ఇంటి బయటకు తీసుకొని వచ్చి మంచాలు వాకిట్లో వేసి పడుకోబెట్టారు... ఆ రోజు ములుగంత తెల్లవార్లూ మెలకువతో ఉండింది.... అప్పటి, ( ములుగు) CI, ప్రకాశం గారు, ఇప్పుడు police station ఎదురుగా ఉన్న బెంజర్స్ టైలర్ place లో ఉన్న ఇంటిలో కిరాయకు ఉండేవాడు... తను కూడ ఆరుబయట అందరి లాగే పడుకున్నారు..
ఈరోజు కూడా, ఉదయం సుమారు 7_00_ 7_ 20 am 2 నుండి 4 సెకండ్ల వరకు వచ్చింది... నా మంచం ఒక్క సారిగా కదలడం ఉలిక్కి పడి లేచాను
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box