*రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన దిల్ రాజ్*
హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ డా. హరీష్ దిల్ రాజును పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజ్ ను అభినందించారు. పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజ్ మాట్లాడుతూ, తెలంగాణా లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చేందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వనున్నట్తు ఆచెప్పారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన షూటింగ్స్ తెలంగాణా లో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని, తెలంగాణాకు చెందిన సినిమాల ప్రోత్సాహానికి ప్రాధాన్యత నిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎక్సహిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.
---------
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box