*_ఇది ప్రజావిజయమా.._*
*_ప్రజాస్వామ్యంపై విజయమా..!?_*
_(బన్ని..బన్ని..బన్నీ..బన్నీ.._
_నిన్ను చూస్తే ఆగనంది బెయిలు)_
నాకు తెలిసి పెద్దోళ్ళకు శిక్ష పడి జైల్లో ఉన్న సందర్భాలు
ఈ దేశంలో అరుదు..
ఒకవేళ అలా జరిగినా ..
అంటే శిక్ష పడకుండా
ట్రయల్ సమయంలోనో..
మరో సందర్భంలోనో
జైలుకు వెళ్లినా తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి అయిపోవడం..
లేదా అప్పటికే ముఖ్యమంత్రి అయి ఉన్నా మళ్ళీ వారి కుర్చీ వారికి భద్రంగా ఇచ్చేయడం..
ఇలా జరుగుతూ ఉంటుంది..
అదీ భారత దేశంలోనే..!
ముందే చెప్పినట్టు మన దేశంలో వర్తమానకాలంలో పెద్దోళ్ళు జైల్లో ఉండడం
పెద్దగా జరగడం లేదు..
అదంతా స్వతంత్ర పోరాటం నాటి కథ ..వ్యధ..ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి ముందే
బెయిల్ సిద్ధంగా ఉంటుంది.
ఒకవేళ జైల్లో ఉండే పరిస్థితి ఉన్నా అరెస్టు గౌరవంగా జరుగుతుంది..జైల్లో రాజభోగాలు.. విడుదల మరింత వైభోగంగా ఉంటుంది.
అటు పిమ్మట పెద్ద ఊరేగింపు..
ఆపై లైవ్ కవరేజీ..అభిమానుల
బ్రహ్మరథం...ఘనంగా అక్కున చేర్చుకునే శాసనసభ లేదా లోకసభ అనే సౌధం..!
స్వతంత్ర పోరాటం సమయంలో గాంధీ ..నెహ్రూ మొదలుకుని అనేక మంది నేతలు జైలుకి వెళ్ళారు..దయచేసి ఇందులో పెడర్ధాలు వెతికి మహనీయుల దేశ భక్తిని..స్వరాజ్య కాంక్షను..
స్వరాజ్య సంగ్రామం స్ఫూర్తిని
అభాసు పాలు చేయొద్దు..
ఈమధ్యన ఇదో ట్రెండుగా మారింది.ఎక్కడో ఎవరో
ఒక పథకం ప్రకారం రాస్తూ ఉంటారు.. ఇంకెవరో వాటిని ఫార్వార్డ్ చేసేస్తారు.కొందరైతే చదవకుండానే..!
సరే మళ్ళీ విషయానికి వస్తే..
మన దేశంలో సంచలనం కలిగించిన అరెస్టుల్లో శిబూసోరెన్..జగన్ ..
ఇంకా ముఖ్యంగా జయలలిత..లాలూ ప్రసాద్..
మొన్నీ మధ్యనే కేజ్రీవాల్..
ఆపై కొందరు కేంద్ర మంత్రులు..
రాజకీయ ప్రముఖులు..
పారిశ్రామిక వేత్తలు..వివిధ రకాల స్కామాగ్రేసరులు ఉన్నారు..వీరి అరెస్టులు
నాటకీయంగా జరుగుతూ ఉంటాయి. కొందరి విషయంలో అయితే అరెస్టు అనగానే గుండెపోటు వస్తుంది...ఆపై వైద్య పరీక్షలు అనే తతంగం ఉంటుంది..అటు పిమ్మట
జైలుకి వెళ్లనవసరం లేకుండా
ఆస్పత్రిలో అడ్మిషన్..బెయిల్ వచ్చేదాకా రోగం నయం కాదు.
ఎసిబి కేసుల్లో సైతం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా..ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ఒకటి రెండు రోజులు జైల్లో..అటు పిమ్మట బెయిల్..ఈలోగా సస్పెన్షన్..
ఆ సస్పెన్షన్ సమయంలో సగం వేతనం..కొన్నాళ్లకు మళ్ళీ పోస్టింగ్.. అధిక సందర్భాల్లో వీగిపోయే కేసులు..
మళ్ళీ మళ్ళీ అక్రమాలు..
అంతా షరా మామూలే..!
రుజువు కానంత వరకు ఎవరూ దోషులు కారట..
దొరికే వరకు అందరూ దొరలే అన్నట్టు..!
భారత రాజ్యాంగానికి
ఓ సలాం..
కోర్టులకు శత కోటి దండాలు..!
ఇక్కడ మరో ముఖ్య విషయం..
ఒక వ్యక్తి పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే తనపై పోలీస్ కేసులు ఉన్నాయా లేదా దృవీకరించుకోవాలి..ప్రభుత్వ
ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సందర్భాల్లో కూడా అంతే..
ఎస్పీల నుంచి క్లియరెన్స్ పొందడం తప్పని సరి.
అదే ఓ వ్యక్తి ఎంత పెద్ద నేరం చేసినా..ఎన్నాళ్ళు జైల్లో ఉన్నా
బయటకు రాగానే ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చు..గెలిచి రాజ్యాలు ఏలవచ్చు..
కొందరైతే జైల్ నుంచే పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుస్తారు కూడా..
మరి మన దేశంలో జనం ఓటు వేసేందుకు ఏ గుణగణాలను
ప్రామాణికంగా తీసుకుంటున్నారో..?
అలాగే ఆరాధించడానికి కూడా..తాజాగా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తీసుకుందాం..
సంద్య ధియేటర్లో జరిగిన
సంఘటన అత్యంత దురదృష్టకరం..ఇందులో అనేక కోణాలను గురించి మాట్లాడు కోవచ్చు..ముందుగా జనాల సినిమా పిచ్చి..మొదటి రోజునే సినిమా చూడాలన్న కాంక్ష..
అదెలాంటి సినిమా అయినా గాని..రిస్కు తీసుకుంటూ..
టికెట్ చార్జిని లెక్క చేయకుండా..ఒక మాతృమూర్తి అదే చేసి
తన ప్రాణాలు తీసుకోవడమే గాక బిడ్డ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడడానికి కారణం అయింది.ఇలా ఎప్పుడూ జరగలేదా ..
ఎన్నిసార్లు వెళ్ళలేదు ..
అనుకోడానికి ఉండదు..
జరిగే రోజున జరుగుతుంది.
అందుకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడడం అనివార్యం..!
ఇక సినిమా వాళ్ళ సంగతి..
ఎవరూ ఇలాంటి దుస్సంఘటనలు జరగాలని కోరుకోరు..కానీ ఊహించవచ్చు.అత్యంత పాపులారిటీ కలిగిన హీరో
సినిమా ధియేటర్ కు మొదటి రోజే వచ్చి జనంతో కలిసి సినిమా చూడడం..వస్తూ వస్తూ లాబీలో పెద్ద హంగామా చెయ్యడం.. మరి తొక్కిసలాట జరగదా..ఈ సంఘటనలో పబ్లిసిటి మానియా అధికంగా కనిపించింది.పూర్వం కూడా హీరోలు..ఇతర నటులు..
దర్శకుడు..టెక్నీషియన్లు ఇలా
సినిమా హాల్స్ కు వచ్చి సినిమాలు చూస్తూ జనం స్పందన తెలుసుకుంటూ ఉండేవారు.అయితే ఎవరికీ తెలియకుండా సినిమా మొదలైన తర్వాత రావడం..
ఇంటర్వెల్లో వీలైనంత వరకు
ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించడం
జరుగుతూ ఉండేది.ఇప్పుడలా కాదే..ప్రచార పటాటోపం..
జనాలకి కనిపిస్తూ తద్వారా సినిమాకి అదో రకమైన హైప్ కల్పించడం లేటెస్ట్ ట్రెండ్.
అల్లు అర్జున్ అదే చేసి
ఇంతటి దారుణానికి పరోక్షంగా కారణమయ్యాడు.ఎన్ని కవరింగులు ఇచ్చినా..
తర్వాత ఎలాంటి సాయాలు చేసినా జరిగిన ఘోరానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ఈ పుష్పరాజే.
ఈ దుస్సంఘటనను ఒక పాఠంగా తీసుకుని
అర్జున్ అనే కాదు సినిమా నటలు..ఆటగాళ్ళు.. రాజకీయ నేతలు..సెలబ్రిటీలు అనే భుజకీర్తి తగిలించుకునే అందరూ తగ్గేదేలే అనకుండా
కాస్త తగ్గి ఉంటే మంచిది.
ఇక అర్జున్ అరెస్టు..బెయిల్..
విడుదల..ఇత్యాది సంఘటనలు భారత రాజ్యాంగాన్ని..చట్టాలను
మరోసారి అపహాస్యం పాలు చేసే విధంగా నడిచాయన్నది
నిస్సందేహం.
ఈ దేశంలో గొప్పోడికి ఒక నీతి..పేదోడికి మరో రీతి..
మళ్ళీ మళ్ళీ రుజవవుతున్న
విషయం బన్నీ అరెస్టు.. విడుదల ఎపిసోడ్లో ఇంకోసారి
ఢంకా బజాయించింది.
అర్జున్ విడుదలయ్యాక సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల
ప్రవర్తన మరీ విడ్డూరంగా ఉంది.అర్జున్ అనే వ్యక్తి
ఈ దేశానికి గొప్ప ఉపకారం చెయ్యడానికో..జనానికి అతి పెద్ద మేలు చెయ్యడం కోసమో
జైలుకి వెళ్లి వచ్చినట్టు
ఆ బిల్డప్ చూస్తుంటే
రోత పుట్టిందని కొందరి కామెంట్..నిజమే కదా..
ఆ కౌగిలింతలు..పరామర్శలు..
వెగటు పుట్టించాయని
చెప్పక తప్పదు.!
రాస్తున్న కొద్ది ఇంకా రాయాలని అనిపించే..రాయడానికి ఉండే
మన దేశ వ్యవస్థల బాగోతం
గురించి మరో కథనంలో మరింతగా చర్చిద్దాం..
అంతవరకు యువరానర్..
*I shall rest my case..*
*_సురేష్..జర్నలిస్ట్.._*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box