*కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి *
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిన మీకు ధన్యవాదాలు
కొన్నేళ్లుగా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయింది.
అలాంటి అపోహలను తొలగించాలని ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారు.
రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఎఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారు..
బుర్రా వెంకటేశం ఐఏఎస్, మహేందర్ రెడ్డి ఐపీఎస్ సర్వేలు రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులే.
రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్పగా రాణించారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.
పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ 200 శాతం పెంచాం..
దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదు.
రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23లక్షలు విద్యార్థులు చదువుకుంటున్నారు..
11వేల ప్రయివేటుశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్రయివేట్ స్కూల్స్ లో చదువు చెప్పేవారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కు అర్హత ఉందా?
మల్టీ టాలెంటెడ్ స్థూడెంట్స్ ను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం..?
ఎందుకు మనం ఆ ఆలోచ ఆ చేయకూడదు.. ఇది మన బాధ్యత కాదా?
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివి..
విద్యార్థుల కోసం పెట్టేది ఖర్చు కాదు..అది వారి భవిష్యత్ కు పెట్టుబడి...
70 ఏళ్ల నుంచి మనం నేర్చుకున్నదేంటి... వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందు నుంచే ఎందుకు ప్రణాళికలు వేసుకోవడం లేదు..?
ఇది ప్రభుత్వం తరపున మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి.
వీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనపై ఉంది..
ఇది మన బాధ్యత.. ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేం..
ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు..
శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది..
మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి
ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా.. తగించేదా..?
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..
ప్రతీ నెలా 10వ తేదీలోగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం..
కుట్టు పనికి ఇచ్చే రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచి వారికి అప్పగించాం.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం
వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.
నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోంది...
అందుకే రాష్ట్రంలో 75 ఐటీఐ లను టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసాం...
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నాం..
మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికే ఆదర్శం...
2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాం.
క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్ జరీన్, సిరాజ్ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.
క్రీడల్లో రాణించండి... మీలో టాలెంట్ కు సాన పట్టండి.
విద్యార్థులలో ఉన్న ఇతర టాలెంట్ ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
కార్పొరేట్ కు ధీటుగా ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం..
ఈ విద్యార్థులు అనాధాలు కాదు...వాళ్లు రాష్ట్ర సంపద..
నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది..
ఇది ఖర్చు కాదు.. భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా చూడాలి..
భవిష్యత్ లో నేను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా..
ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు
విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయండి..
వారు తినే ఆహారాన్ని వాళ్లే మానిటరింగ్ చేసుకునే వీలు కల్పించాలని అధికారులను ఆదేశిస్తున్నా..
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box