కాంగ్రెస్ పాలనలోనే సినీ పరిశ్రమకు మేలు -సీఎం రేవంత్ రెడ్డి

 

సినీ పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్కమల్లు 


-----------------------

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణానికి సినీ పరిశ్రమ నుంచి కొంత సేస్ వేయాలనుకుంటున్నాం


రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్నాం

సమగ్ర కుటుంబ సర్వే, ఇలాంటి డ్రగ్స్ వంటి కార్యక్రమాల్లో సినీ పరిశ్రమ బాధ్యత పంచుకోవాలి 


సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే 

----------------------

రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 50 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుండగా మరో 50% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనారిటీ, దళిత, విద్యార్థుల కోసం

 ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో సుమారు 200 కోట్ల పెట్టుబడితో ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుంది. ఒక్కో పాఠశాల పూర్తికి 20 నుంచి 25 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. దీనికోసం సినీ పరిశ్రమ నుంచి కొంత సెస్ రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చాలని అనుకుంటున్నాం. ఇది ఒక నోబుల్  కాజ్ ఇందుకు సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. 



సినీ అభిమానుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. వారి భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి, ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సినీ నటుల ప్రచారం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు సామాజిక బాధ్యతలో భాగంగా సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించాలని కోరారు. 


స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు గడిచింది. రాష్ట్రంలోని సంపద ఈ సుదీర్ఘకాలంలో ఏ వర్గాలకు వెళ్ళింది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుంది.  ఈ సర్వే ద్వారా వచ్చే అంకెలు, సంఖ్యల ద్వారా రాష్ట్ర సంపదను ఏ వర్గాలకు పంచాలి అనేది నిర్ణయించనున్నాము. సామాజిక బాధ్యతలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో సినీ నటులు వారి గొంతు వినిపించాలి, పాల్గొనాలని సూచించారు. 


సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అని, ఆ వారసత్వాన్ని మా ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం, డిప్యూటీ సీఎం తెలిపారు. సినీ స్టూడియోలకు, కార్మికులకు స్థలాలు కాంగ్రెస్ హయాంలోనే కేటాయించామని గుర్తు చేశారు.

రాష్ట్రంలోని సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా ఎకో సిస్టమును సపోర్ట్ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం అందులో ఏఐకి ప్రాధాన్యత ఇస్తాం.


రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్నాం, తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందాలని అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అందులో అందరూ భాగస్వాములు కావాలి


సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చేసిన సూచనలకు సమావేశానికి హాజరైన సినీ ప్రముఖులంతా తమ సమ్మతిని తెలిపి.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు