నగర సమగ్రాభివృద్ధికి ఆర్థిక సహకారం అందించండి: నగర మేయర్ గుండు సుధారాణి

 


నగర సమగ్రాభివృద్ధికి ఆర్థిక సహకారం అందించండి: నగర మేయర్  గుండు సుధారాణి

     ▪️అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రాం వాటర్ డ్రైన్స్ పారిశుద్ధ్యం గ్రీన్ బడ్జెట్ కు నిధులు అందజేయాలని వినతి....

   ▪️ 16వ ఆర్థిక సంఘం సమావేశం లో ప్రసంగించిన మేయర్....


 నగర సమగ్రాభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి 16 వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం న్యూ ఢిల్లీ లో 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసిన సమావేశం లో 10లక్షల కంటే తక్కువ జనాభా గల నగరాల కేటగిరిలో నగరం నుండి ప్రాతినిధ్యం వహించిన మేయర్ హాజరై నగరం లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులు వాటికి అవసరమైన ఆర్థిక వనరుల గురించి మేయర్ 16 వ ఆర్థిక సంఘానికి నివేదించారు.

   ఈ సందర్భం గా మేయర్ నగర విశిష్టత ను తెలియజేస్తూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉందని వరంగల్ తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం గానే కాకుండా కీలకమైన విద్యా పారిశ్రామిక కేంద్రంగా మారిందని నగరం యొక్క వేగవంతమైన అభివృద్ధి రాష్ట్రంలో నగరానికి పెరుగుతున్న ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుందని, నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక వనరులను అందించడం అత్యంత కీలకమని నగరం ఇటీవల 42 గ్రామాల విలీనంతో గ్రేటర్ గా ఆవిర్భవించిందని జీడబ్ల్యూఎంసీ విస్తీర్ణం 407.7 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని 2024 నాటికి నగర జనాభా 10.48 లక్షలకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెండవ అతిపెద్ద నగరంగా వ్యూహాత్మక సాంస్కృతిక విలువను గుర్తిస్తూ, వరంగల్‌ను ప్రధాన పట్టణ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సుముఖం గా ఉన్నారని పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి కార్పొరేషన్ తరపున కృషి చేస్తున్నామని నగరానికి ఆవశ్యమైన అవసరాలలో ప్రధాన మైన అంశాలను మేయర్ ఆర్థిక సంఘానికి నివేదించారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పారిశుద్ధ్యం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి నగరానికి తక్షణమే సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అవసరం అని గుర్తించి. డీపీఆర్ సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతుందని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,170 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందని, నగరానికి వరద నీటి కాలువలు, భూగర్భ వాహిక, సరస్సులు నీటి వనరుల పునరుద్ధరణ నీటి సరఫరా వంటి సమగ్ర అభివృద్ధికి అదనంగా రూ.5 వేల కోట్లు అవసరం అని ఇందుకోసం బల్దియా కు 16వ ఆర్థిక సంఘం కింద రూ.5వేల కోట్లు మంజూరు చేయవలసిందిగా మేయర్ కోరారు.

 నగరంలో ప్రతిరోజూ 450 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని ఇప్పటికే 4 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాల పేరుకుపోయి ఉన్నాయని. అట్టి వ్యర్ధాలను ఖననం చేయడానికి బయో మైనింగ్ ప్లాంట్‌లను స్థాపించాల్సిన అవసరం ఉందని వీటికి రూ. 50 కోట్లు స్వచ్ఛ్ భారత్ మిషన్ ఫండ్స్ (ఎస్ బి ఎం) కింద రూ. 100 కోట్లు అవసరం అని అట్టి నిధులు 100% వ్యర్థ పదార్థాల నిర్వహణ కవరేజీని సాధించడంలో స ఉపయుక్తం గా ఉంటుందని కొత్తగా నగరంలో విలీనమైన గ్రామాల్లో జనాభా పెరుగుతుండడంతో కనీస సౌకర్యాలు కల్పించడం జీ డబ్ల్యూ ఎం సి కి సవాలుగా మారిందనీ వనమహోత్సవం వంటి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాల నిర్వహణకు బల్దియా సొంత ఆదాయ పన్ను వసూళ్లు సరిపోవని గ్రీన్ బడ్జెట్ చెల్లింపు కోసం టైడ్ కాంపోనెంట్‌లో 16వ ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్‌ను మంజూరు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నట్లు ఈ సందర్భం గా మేయర్ తెలిపారు

  అనంతరం మేయర్ కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తు వరంగల్ అభివృద్ధి భవిష్యత్తు 16 వ ఆర్థిక సంఘం చేతుల్లోనే ఉందని సంఘం మద్దతుతో నగరం అభివృద్ధి చెందడానికి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందజేయడానికి అవసరమైన వనరులను అందజేయాలని అభ్యర్థించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు