సీనియర్ సిటిజన్స్ కు సైబర్ క్రైమ్ పై అవగాహన

 


*సైబర్ జాగృతి దివస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్.*

 *సీనియర్ సిటిజన్స్ కు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం.*

ఈరోజు సైబర్ జాగృతి దివస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ సందర్భంగా హనుమకొండ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సీనియర్ సిటిజన్స్ పై సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న తీరును వారికి వివరించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న అంశాలు ఫేక్ యు ఆర్ ఎల్ స్కాం, డిజిటల్ అరెస్ట్, ఇంప్రెషన్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ సైబర్ జాబ్ ఫర్ సోషల్ మీడియా ఫ్రాగ్ లాంటి అంశాలపై సీనియర్ సిటిజన్లకు సవివరంగా వివరించారు. అదేవిధంగా 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ జరిగి డబ్బులు కోల్పోయిన ఎడల వెంటనే 1930 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంత తక్కువ సమయంలో ఫిర్యాదు చేసినట్లయితే అంత ఖచ్చితంగా డబ్బులు తిరిగి పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిబ్బంది   పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు