బహు
జన చైతన్యంతో రాజ్యాధికారం చేపట్టాలి
ఐ ఎల్ పిఎ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాయిని నరేందర్
తరతరాలుగా దోపీడికి గురవుతున్న బహుజన వర్గాలు చైతన్యం చెంది బహుజన రాజ్య స్థాపన చెందిన నాడే దేశంలోని 90 శాతం ప్రజలు విముక్తి చెందుతారని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాయిని నరేందర్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో రెవెల్లి రవీందర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బాంసెఫ్ కేడర్ క్యాంప్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతం పైగానున్న బి.సి సమాజానికి అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే బి.సి జనగణన చేయకుండా రాజకీయ పార్టీలు బి.సి లకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కాకా కలేల్కర్ కమీషన్, బి.పి మండల్ కమీషన్ ల నివేదికను అమలు పరచకుండా, జనగణన చేయకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. బి.సి ల సమస్య దేశ వ్యాప్త సమస్య అని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కుల జనగణన చేపించి సకల సామాజిక రంగాల్లో, చట్టసభల్లో బి.సి వాటా సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు దయ్య రాజారామ్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షీరాం లాంటి మహనీయులు చూపిన మార్గంలో ప్రజలు చైతన్యం చెందాలని, శత్రువును, మిత్రువును గుర్తించి ముందుకు సాగాలని, అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో రాజ్యాధికార చేపట్టాలని అందుకోసం విద్యార్థి, యువత గ్రామ గ్రామాన ఓటు చైతన్యం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ నాయకులు దయ్య రాజారామ్, తుల రాజేందర్, భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దయ్య రఘువీర్, నవయాన్ బుద్ధిస్టు సొసైటీ మెట్టుపల్లి అద్యక్షులు నీరటి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ముప్పారపు రవీందర్, మునుగూరి అజయ్, వివిధ సంఘాల నాయకులు కారం బూమేష్, విద్యార్థులు కుసుమ రాకేష్, మాల్వే ఉదయ్ కుమార్, వరికుప్పల సంతోష్, జగన్నాథం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box