ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పాదయాత్ర సందర్బంగా చేసిన ప్రసంగం.
ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతోంది..
పాలకులు పగ పట్టారా.. దేవుడు శాపం పెట్టిండా అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు...
మూసీపునరుజ్జీవింప చేయాలని కోరుతున్నారు..
ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు.. ఇక్కడి చెరువుల్లో చేపలు బ్రతికే పరిస్థితి లేదు..
ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు.. ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి..
పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి.
బీఆరెస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు..
అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని అడ్డుకోవాలని చూస్తున్నారు.
మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు.
మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు.
వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోంది..
అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండి..
మోదీ గుజరాత్ ను బాగు చేసుకోవచ్చు కానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా..
*ఇది నా జన్మదినం కాదు... ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమైంది.*
*సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా..*
*మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..*
బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్న వాళ్లు వాళ్ల పేర్లు ఇవ్వండి...
మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా..
బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి..
మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా... మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తా..
మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే... మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా?
నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్ ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్
నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ... మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు..
వాళ్ల అవినీతి కోసం, వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారు..
*మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది..*
*ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది*
*బిల్లా రంగాలకు సవాల్ విసురుతున్న*
*2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతా*
*బిల్లా రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం..*
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box