పోలీస్‌ కీర్తి ప్రతిష్టలు పెంపొందించే రీతిలో ప్రజా సేవకు అంకితం కావాలి

 


పోలీస్‌ కీర్తి ప్రతిష్టలు పెంపొందించే రీతిలో ప్రజా సేవకు అంకితం కావాలి -వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా


పోలీసులు శాంతి భద్రతల పరిరక్షిస్తూ, పోలీస్‌ కీర్తి ప్రతిష్టలు పెంపొందించే దిశగా  నిరంతరం ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళకు పిలుపునిచ్చారు. తోమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 246 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ (సివిల్‌) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను(దీక్షాంత్‌ పరేడ్‌) గురువారం మడికొండలోని సిటి పోలీస్‌ శిక్షాణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్యఅతిధిగా హజరై ముందుగా ట్రైనీ కానిస్టేబుళ్ళ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో వివక్ష చూపమని, తమ సేవలతో దేశ ప్రతిష్టలను పెంచుటామని శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుళ్ళ చేత సిటిసి ప్రిన్స్‌పాల్‌ రవి ప్రతిజ్ఞ చేయించారు. 



ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించేది పోలీసులు మాత్రమేనని, నేటి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ళు ఈరోజు నుండి పోలీస్‌ శాఖలో పూర్తి బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యారని.  ముఖ్యంగా శాంతి భధ్రతలను పరిరక్షించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, అలాగే ప్రజల హక్కులు, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రజల స్నేహపూర్వకంగా వ్యహరించాల్సి వుంటుందని. అలాగే క్రమశిక్షణ అనేది ప్రతి పోలీస్‌ అధికారికి ముఖ్యమని గుర్తించుకోవాలని, శిక్షణ సమయంలో అనుసరించిన క్రమశిక్షణను రాబోవు రోజుల్లో కూడా అనుసరించాలని. అనునిత్యం విధినిర్వహణలో ఎదురయ్యే పనివత్తిడితో పాటు ప్రతికూల పరిస్థితులలో కూడా భాధ్యతలు నిర్వర్తించాల్సి వుంటుందని. ప్రలోభాలకు లొంగకుండా నీతి, నిజాయితీ విధులు నిర్వహించే పోలీసులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు, అధికారుల గుర్తింపు వుంటుందని. ఉన్నత చదువులు చదివి నైపుణ్యంతో పనిచేయాలనుకున్నవారికి పోలీస్‌ శాఖలో  వివిధ విభాగాల్లో పనిచేసేందుకు అవకాశాలు అధికమని. నూతన పరిజ్ఞానంపై మరింత పట్టుసాధించడంతో పాటు,  కోత్త చట్టాలను సమర్థవంతంగా అమలుచేస్తూ తెలంగా రాష్ట్ర పోలీస్‌ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసురావాలని,పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు అంకిత భావంతో సేవలు అందిస్తూ వృత్తిపరం జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని సిపి ట్రైనీ కానిస్టేబుళ్ళకు తెలిపారు.


అంతకు ముందు శిక్షణా కేంద్రం ప్రిన్స్‌పాల్‌ మాట్లాడతూ ఉమ్మడి మహబూబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన  ట్రైనీ కానిస్టేబుళ్ళుకు గత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమైన తొమ్మిది నెలల పోలీస్‌ శిక్షణ సమయంలో  ట్రైనీ కానిస్టేబుళ్ళకు పరిపాలన, డాక్యుమెంటేషన్‌, వ్యక్తిత్వ వికాసం. లా అండ్‌ ఆర్డర్‌, ఇంటెలిజెన్స్‌ మరియు అంతర్గత భద్రత, పోలీస్‌ చట్టాలు, దర్యాప్తు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ మరియు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ఇ అవుట్‌డోర్స్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌, స్క్వాడ్‌ డ్రిల్‌, ఆర్మ్స్‌ డ్రిల్‌, లాఠీ డ్రిల్‌, టియర్‌ గ్యాస్‌ మరియు మాబ్‌ ఆపరేషన్‌లు, వెపన్‌ ట్రైనింగ్‌, ఫీల్డ్‌ క్రాఫ్ట్‌,ట్రాఫిక్‌, ఫస్ట్‌ ఎయిడ్‌, పోలీస్‌ అప్లికేషన్ల వినియోగం మొదలైన అంశాల్లో ట్రైనీ కానిస్టేబుళ్ళకు శిక్షణ అందజేయడం జరిగిందని ప్రిన్స్‌పాల్‌ తెలిపారు.

ఈ సందర్బంగ శిక్షణలో ప్రతిభ కనబరిచిన నాగరాజు, రవి,శశిధర్‌ గౌడ్‌లకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా జ్ఞాపిలను అందజేసారు.

ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు రవి, శ్రీనివాస్‌, వైస్‌ప్రిన్స్‌పాల్‌ రమణబాబు, ఎసిపిలు తిరుమల్‌, సురేంద్ర, అనంతయ్య, ఆర్‌.ఐ ఉదయ్‌భాస్కర్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, స్పర్జన్‌రాజ్‌, ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌,మంగీలాల్‌, కిషన్‌తో పాటు ఎస్‌.ఐలు, ఆర్‌.ఎస్‌.ఐలు ఇన్‌డోర్‌,ఆవుట్‌డోర్‌ సిబ్బందితో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు