కిట్స్ వరంగల్-సెంట్రల్ లైబ్రరీలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం*
సెంట్రల్ లైబ్రరీ, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కిట్స్ డబ్ల్యు), 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాలలో 2024 నవంబర్ 14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగ నున్నాయి.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి మరియు డీన్, అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్ లు సంయుక్తంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లైబ్రరీ సమాచార బ్రోచర్‌ను విడుదల చేశారు.
డిజిటల్ లైబ్రరీలో 1200 సరికొత్త శీర్షికలు మరియు 9000 డిజిటల్ జర్నల్స్‌తో పుస్తక ప్రదర్శనను అధ్యా పకులు, విద్యార్థుల నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి. నారాయణరెడ్డి సెంట్రల్ లైబ్రరీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానం, వ్యక్తిగత ఎదుగుదల, సాధికారత, విద్యార్థుల చైతన్యాన్ని పెంపొందించే అమూల్యమైన సంస్థలని అన్నారు. లైబ్రరీ వనరుల సంపదకు ప్రాప్తిని అందిస్తుందని, పఠన ప్రేమను పెంపొందిస్తుందని అంతేకాకుండా జీవితకాల అభ్యాస అవకాశాలను అందిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్‌రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీ, ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ , 16115 శీర్షికలు, బ్యాక్‌వాల్యూమ్‌లు ఉన్నాయని, 6022 ఇ-పుస్తకాలు, AICTE తప్పనిసరి జర్నల్స్ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా 50866 ఆన్‌లైన్ జర్నల్స్ తో 84575 పుస్తకాలు అత్యాధునిక లైబ్రరీ సౌకర్యాలను మా యాజమాన్యం కల్పిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల గ్రంథ పాలకుడు డాక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన వ్యక్తిత్వం బుక్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో డీన్, అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, లైబ్రేరియన్ కె ఇంద్ర సేనా రెడ్డి, లైబ్రరీ అడ్వైజరీ కమిటీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎం.శ్రీలత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, వివిధ శాఖల ఆచార్యులు ప్రొఫెసర్ బి. రమాదేవి, సి.వెంకటేష్, అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజికల్ సైన్సెస్ & పి. ఆర్. ఓ. డాక్టర్ డి.ప్రభాకరా చారి, యమ్. నిరంజన్ (అసిస్టెంట్ లైబ్రేరియన్), లైబ్రరీ సిబ్బంది, ప్రిన్సిపల్ ఆఫీస్ సూపరింటెండెంట్లు S. సతీష్ & G. రవీందర్ వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box