_*కోహ్లీ @ 37..!*_
-------------------------------------
_హ్యాపీ బర్త్ డే విరాట్_
🌸🌸🌸🌸🌸🌸🌸
భారత క్రికెట్లో
సరికొత్త హిస్టరీ..
మరోపేరు విక్టరీ..
రిటైర్ కాకమునుపే
లెజెండరీ..
విరాట్ కోహ్లీ..
ఏ ఫార్మాట్ లోనైనా
ప్రత్యర్థులతో బాహాబాహీ!
క్రికెట్ కోసం
పుడతారు కొందరు...
క్రికెట్ నుంచి పుట్టేది ఇంకొందరు...
క్రికెట్టే తానుగా
పుట్టినోడు విరాట్...
భారత క్రికెట్లో
నవయుగ సామ్రాట్..!
స్లిప్పు..పాయింట్..గల్లీ.
లాంగాఫ్..లాంగాన్..
పొజిషన్ ఏదైనా
కోహ్లీ లగాన్..
నో పరేషాన్..
ఫీల్డింగులో సర్వాంతర్యామి
బ్యాటింగులో కనిపించదు
పరుగుల లేమి..
అనుష్కతో నాతిచరామి..!
భారత క్రికెట్టుకు గవాస్కర్
పరుగుల హస్తవాసి..
కపిల్ దేవ్ ప్రపంచకప్ వాశి
సచిన్ టెండూల్కర్
రికార్డుల సహవాసి..
ధోని అభిమాన
హృదయ నివాసి..
కోహ్లీ..గెలిచి తీరాలన్న కసి..!
చిరుత వేగం..
డేగ కన్ను..
పులి దూకుడు..
ఏనుగు ఘింకారం..
రోసంతో కూడిన మీసం..
సింహం పౌరుషం..
అదే కోహ్లీ వేషం..!
నీరు తాగినంత సులువుగా
పరుగులు..
ఎన్ని టెస్టులో అన్ని ఇన్నింగ్సు..
వేటికవే బెస్టులు..
ఇంకా తగ్గని జోరు..
బరిలోకి దిగితే ఇప్పటికీ
స్టేడియంలో అదే హోరు..
ప్రత్యర్థులకు బేజారు..
విరాట్ ఉన్నంతసేపు
మనకి గెలుపుపై భరోసా
సహచరులు కులాసా..
అవతలోళ్ళ చెవుల్లో
ఓటమి స్వరాల
సరిగమ"పద"నిసా..
గెలుపే అతగాడికి
ఇష్టమైన నిషా..
కోహ్లీ భాయ్..
ఇదే స్ఫూర్తితో
నువ్వు కొనసాగాలి హమేషా!
కొంత వేగం తగ్గినా విరాట్ మళ్ళీ అందుకుని ఇంకొంత కాలం ఆటలో కొనసాగాలని
కోరుకుంటూ...
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box