*_లక్షణంగా లక్ష్మణ్..!_*
ఆర్కె లక్ష్మణ్ తో
నా ఇంటర్వ్యూలో
ఒక ప్రధానాంశం
ఇక్కడ పొందుపరుస్తున్నా..
ఆయన మాటల్లోనే..
ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎన్నారై మిత్రుడి ఇంట్లో దిగాను..లాన్లో మేమిద్దరం పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా
పక్క బంగ్లా పిల్లాడు
మా మిత్రుడి మనవడితో ఆడుకోడానికి వచ్చాడు..కాసేపు..అంటే చాలా కొద్ది సేపు ఆడుకున్న
తర్వాత మా మిత్రుడు
ఆ కుర్రాడిని ఇక మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు.
ఆ పిల్లాడు
ఇంకా ఆడుకుంటూ ఉంటే
మా మిత్రుడు తరిమేసినంత పని చేశాడు..
ఆ పిల్లాడు వెళ్లిపోయిన తర్వాత నేనన్నాను..
నువ్వు చేసిన పని నాకు రుచించలేదు..మన దేశం ఆతిధ్యానికి పెట్టింది పేరు.మన ఇళ్ళలో చుట్టుపక్కల పిల్లలు అందరూ వచ్చి మన పిల్లల్లా కలిసి మెలిసి ఆడుకోవడం
అలవాటు కదా..
పది మందిని కలుపుకుని జీవించడం మన దేశ సంస్కృతిలో ప్రధాన భాగం కదా..అలాంటి దేశం నుంచి వచ్చిన మీరు ఇక్కడికి వచ్చి ఇలా మారిపోయారేంటి..
ఇదేనా ఇక్కడ మీరు నేర్చుకున్నది అని అడిగాను..
దానికి నా మిత్రుడు చెప్పిన సమాధానం ముందు నన్ను చకితున్ని చేసినా తర్వాత ఆలోచింపచేసింది.
ఇంతకీ మా మిత్రుడు చెప్పింది ఏంటంటే..
ఆ అబ్బాయి ఇపుడు మన ఇంట్లో ఆడుకుంటూ పడిపోయి దెబ్బ తగిలించుకుంటే
వాళ్ళ నాన్న
మా మీద కేసు పెడతాడు.
ఆ బాధ మనకెందుకు..
ఇక్కడ చాలా విషయాలు ఇలాగే ఉంటాయి.
అప్పుడు నేనన్నాను..
అమెరికా వచ్చి మీరు చాలా
సంపాదించి ఉండవచ్చు..
ఇంకెన్నో సాధించి ఉండవచ్చు..కానీ మన
సంప్రదాయాలకు..
విలువలకు..అన్నిటినీ మించి
కొన్ని చిన్న చిన్న ఆనందాలకు..గొప్ప గొప్ప బంధాలకు దూరం అవుతున్నారు.. తెలుస్తోందా..
ఇవి కోట్లు సంపాదించినా రానివి..లక్షలు ఖర్చు పెట్టినా దొరకనివి..
అంటూ పెద్ద నిట్టూర్పు విడిచాను..
అప్పుడు నేననుకున్నాను..
ఇలాంటివి విన్నప్పుడు నేనైతే
కార్టూన్ గీయలేను గాని అన్నయ్య..
(ఆర్కే లక్ష్మణ్)పెద్ద కథ..
లేదంటే ఎన్నారై డేస్..
రాసేస్తాడు..!
ఇదీ క్లుప్తంగా ఆర్కేను నేను చేసిన ఇంటర్వ్యూలో
ఒక కీలక అంశం...
ఈ ఇంటర్వ్యూ చేసి చాలా కాలం అయినా ఆ మాటలు చెప్తునప్పుడు ఆయన మొహంలో కదలాడిన
బాధా వీచికలు ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నాయి.
ఇప్పుడు నాకు అనిపిస్తున్నది జోడిస్తున్నాను.ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా
నీ తల్లి భారతిని..నిలుపరా
నీ జాతి నిండు గౌరవాన్ని..
మన దేశం నుంచి వెళ్లి
వేరే దేశాల్లో స్థిరపడిన మనవాళ్ళలో చాలా మంది మూలాలు మర్చిపోలేదు.
కాని ఎక్కువ మంది
ఆయా దేశాల్లోని సంస్కృతికి..
నియమ నిబంధనలకు అలవాటు పడిపోతున్నారు.
అవి గొప్పవే కావచ్చు.
కానీ అవి మాత్రమే గొప్పవి అనుకోలేము కదా..
స్వదేశానికి వచ్చినప్పుడు కూడా వాటినే పాటిస్తుండడం..
అవే గొప్పవన్నట్టు మాట్లాడుతూ ఉండడం మనందరికీ అనుభవం.
పైగా మీరెప్పుడు మారతార్రా ఆంటూ ముక్తాయింపులు..!
ఎవరు మారినా..ఏమారినా
మనం మనమే..
భారతదేశమే
*_మన ఐడెంటిటీ.._*
*_మన ఇంటెగ్రిటీ.._*
అలా చెప్పుకోవడంలోనే
*_అంతులేని డిగ్నిటీ..!_*
_______________________
*_సురేష్..9948546286_*
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box