*_ఆమె ఇం'ధైర్యమ్మ'..!_*
++++++++++++++++
జాతిని ఒక్క త్రాటిపై
నడిపిన ధీరవనిత..
ప్రపంచ దేశాలకే
నాయకత్వం వహించిన
*ఉక్కు మహిళ..*
నెహ్రూ వారసురాలిగా
రాజకీయ అరంగేట్రం..
బిగిసిన మహామహుల
కుయుక్తుల చట్రం..
పురుషాధిక్యతను త్రోసిరాజంటూ
ఆమె సాగించిన ప్రస్థానం
*ఓ చరిత్ర...*
ఆధునిక భారతాన
*_ఆమె ఉనికి సరికొత్త చరిత్ర..!_*
*ఇందిర ఈజ్ ఇండియా..*
ఎందరికో ఆమె పేరంటేనే
ఓ చిత్రమైన మేనియా..
చట్టసభల్లో ఆమె ప్రసంగాలకు
అప్పుడప్పుడూ విపక్షాలు సైతం తాలియా..
అలా చెక్కు చెదరని చరిష్మాతో
ఏలలేదా దునియా..
ఆమె గళం మధురం
రూపం సమ్మోహనం
అంతుచిక్కని అంతరంగం
మాట తూటా
అంతకంటే తీవ్రంగా పేలే
రెండో బేటా..
*_భారతంలో విఫలమైన సంజయ రాయబారం_*
ఆమె అద్వితీయమైనా
ద్వితీయ పుత్రుడయ్యాడ
రాజకీయంలో
మోయలేని భారం..
ఒక్క చిన్న షాక్ తో
దేశానికి యమర్జెన్సీ షేక్...
అప్పుడే అయ్యాడు
ఈ పిల్ల గాంధీ
పెద్ద ఖల్నాయక్..!
మనిషి నచ్చితే అందలం..
వైఖరి రుచించకపోతే పాతాళం
చుట్టూ భజన మేళం..
ఆ క్షణానే అనుకూలంగా
మాటాడే ఆమె గళం..
తేడా వస్తే మరుక్షణమే
కక్కేది గరళం..!
*_దేశంలో సంస్కరణలకు సూత్రధారి.._*
చిన్న కొడుకు ఆగడాల
అదుపులో గాంధారి..
ఢిల్లీకి రాణి
కోడలిని సాధించడంలో మాత్రం
సాధా"రణ" గృహిణి..
అత్తా నువ్వు యురేకా
అనలేదని మనేకా
ఆమెని ఆడేసింది షకామికా..
ఆమె ఉద్వాసనకు పావులు కదిపేసింది చకాచకా..!
ఇండియాకి
*_ఆమె ప్రియనాయకి_*
చాలామందికి ప్రతినాయకి..
*తండ్రికి ప్రియదర్శిని..*
కొడుకులకు పట్టం కట్టేందుకు
తపించిన ప్రియజనని..
తండ్రి నుంచి వారసత్వంగా *_పదవిని..పటిమని.._*
*_పోరాటాన్ని..పాటవాన్ని.._*
పొందిన దిగ్గజ వనిత..
ఎందరికో రక్షణ కల్పించి
ఇంకెందరికో శిక్షలు విధించి
ఎన్నో కక్షలు సాధించిన
*మహానాయకురాలు*
అంగరక్షకుల వేటుకే
బలైన దుఖాంతం..
ఆధునిక భారత ఇతిహాసంలో
అత్యంత విషాద ఉదంతం..!
#################
_భారతరత్న ఇందిరాగాంధీ_
_జయంతి 19.11.1917_
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box