సైబర్ నేరాలు - రక్షణ చర్యలు
మన స్వీయ జాగ్రత్తలు
ఈ మధ్య కొత్తరకం సైబర్ నేరస్తులు తయారయ్యారు. వీరి గురించి అన్ని వార్తాపత్రికలలో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. రోజు ఈ పేపర్ చదివే మా స్నేహితుడు ఈ సైబర్ నేరస్తుల నుండి తనను తాను కాపాడుకోగలిగాడు. సైబర్ నేరస్థుడు మా స్నేహితునికి ఫోన్ చేసి మీ పేరు ఇదేనా, మీ అబ్బాయి పేరు ఇదేనా, మీ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడా,మీ అబ్బాయి మీకు ఒక అని ఏదో చెప్పబోయాడు. న్యూస్ పేపర్లో చదివిన ఈ కొత్తరకం సైబర్ నేరాల గురించి తెలుసు కాబట్టి, అతను ఆ సైబర్ నేరస్తుడితో, సైబర్ నేరాలు అరికట్టే వారికి ఫోన్ చేస్తాను నువ్వు లైన్ లో ఉండు అనగానే అతడు ఫోన్ కట్ చేశాడు.
కొందరికి ఈ సైబర్ నెరగాళ్లు ఫోన్ చేసి మీ పేరు, మీద మీ పిల్లల నుండో, ఇతరుల నుండో డ్రగ్స్ వచ్చినై అని చెప్పి వారిని కరాగర శిక్ష నుండి తప్పించేందుకు లక్షలు వసూలు చేస్తున్నారు. నా స్నేహితుడు తప్పించుకోగలిగాడు గాని ఎందరో భయపడి లక్షల కొద్ది నష్టపోతున్నారు.
కానీ అసలే న్యూస్ పేపర్ చదవని అంత సమయం లేని ఒక ఐటీ ప్రొఫెషనల్ దీనికి బలైపోయాడు. అతన్ని డిజిటల్ అరెస్ట్ అని నాలుగు గంటలు ఆయన ఇంట్లోనే ఆయన గదిలోనే బంధించి నానా విధాల మానసిక చిత్రహంస చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. ఈ విధమైన సైబర్ నేరస్తులకు బలి అయినా ఒక 74 ఏండ్ల మహిళ 32 లక్షలు తనే సొంతంగా బ్యాంకుకు వెళ్లి ఆ సైబర్ క్రిమినల్స్ చెప్పిన ఎకౌంట్లో డబ్బులు వేసి మోసపోయింది.
అసలు విషయం ఏంటంటే ఈ సైబర్ నేరస్తులకు విదేశాలకు తమ పిల్లల్ని పంపిన వారి యొక్క వివరాలు ఎలా తెలుస్తున్నాయి? సాధారణంగా ఇలాంటి విషయాలు పాస్పోర్ట్ ఆఫీసులో గాని, లేక వారి విదేశాల్లో ఉండే వారి పిల్లలకు తినుబండారాలు పంప్ ఫెడెక్స్ లాంటి సంస్థల దగ్గర గాని, లేక వారికి డబ్బు పంపించే యూనిమని లాంటి సంస్థల దగ్గర ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీసులలో విషయాలు అంత త్వరగా బయటికి లీక్ అయ్యే అవకాశం ఉండవు. అంటే ఈ సమాచారం డబ్బు లేదా వస్తువులు చేరవేసే సంస్థల ద్వారా సైబర్ నేరస్తులకు చేరుతుంది. ఈ సంస్థల కంప్యూటర్ వ్యవస్థను హ్యాక్ చేసి అంటే రహస్యంగా వాటిలోనికి వైరస్ల ద్వారా వీరి ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెట్టి వారి దగ్గర ఉన్న సమాచారాన్ని దొంగిలించటం లేక సంస్థలో పనిచేసే వారిని బెదిరించో లేక వారిని ప్రలోభ పెట్టొ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా ఉంది.
ఈ మధ్య ఆధార్ కార్డు సంస్థ దగ్గర ఉన్న వివరాలు కూడా దొంగలించబడ్డాయని ఒక న్యూస్ వచ్చింది. ఒక ఐటీ ప్రొఫెషనల్ కి మీ ఆధార్ ఉపయోగించి ఒకరు వందల కోట్ల క్రైమ్ చేశారు. అందులో మీ పాత్ర కూడా ఉందని మేము అనుమానిస్తున్నాము. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఇవ్వండి అందులో ఉన్న డబ్బంతా వారు చెప్పిన ఎకౌంట్కి పంపిస్తే మేము వెరిఫై చేసి ఒకవేళ మీరు నిర్దోషిలైతే ఆ మొత్తం తిరిగి మీకు పంపిస్తాను అని బెదిరించారు.
ఇలాంటి సైబర్ క్రైమ్ల గురించి ప్రధానమంత్రి మోడీ కూడా ఈ మధ్య తన మన్ కీ బాత్ చెప్పాడు. అయినా ఆ రోజు తర్వాత వరుసగా ఈ సైబర్ క్రైమ్లకు బలైన వారు ఎంతోమంది ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్లు సైబర్ క్రైమ్ ల గురించి ఎంతో ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా వారు ఎన్నో విధాల రక్షణ వ్యవస్థల్ని కూడా ఏర్పరిచారు.
తెలంగాణ ప్రభుత్వం బషీర్బాగ్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే పేరుతో సైబర్ క్రైమ్ నియంత్రణకు, బాధితుల రక్షణకు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పరిచింది. రాష్ట్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ వెబ్సైట్లో 30 రకాలకు పైగా ఏ విధంగా సైబర్ క్రిమినల్స్ ప్రజలను మోసం చేస్తారో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం మొత్తంలో సైబర్ క్రైమ్ ల వల్ల బలి అయిన వారు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారన్నది నిరూపిచమైనటువంటి విషయం.
ప్రతిరోజు దేశంలో కొన్ని లక్షల రూపాయల వరకు సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు నష్టపోతున్నారనేది కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో దేశ ప్రజలు 1740 కోట్ల రూపాయలు సైబర్ నేరాల ద్వారా నష్టపోయారు. ఒక పరిశోధన ప్రకారం 2047వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము దేశ ప్రజలు 17 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారని అంచనా.
అంతేకాకుండా కొందరు ప్రాణాలు కూడా ఈ సైబర్ క్రైమ్ తీస్తుంది. ఆ మధ్యలో ఒక స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి మీ అమ్మాయి అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉన్నాయి. డబ్బులు పంపిస్తే మేము ఆ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్లో పెట్టమని చెప్పి బెదిరించారు. అది అబద్దం అని ఆమె కొడుకు చెప్పినా ఆమె భయానికి గుండె నొప్పి వచ్చి చనిపోయింది. సైబర్ క్రైమ్ల వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి.
ఇందులో ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా దీని నిమిత్తం హైదరాబాదులో ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 1930 మరియు వాట్సాప్ నెంబర్ 8712665171 నీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కేటాయించాయి. అంతే కాకుండా లక్ష లోపు సైబర్ క్రైమ్ నష్టాలు జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్కు అంతకన్నా ఎక్కువ నష్టాలు జరిగితే సైబర్ క్రైమ్ సెల్ ను సంప్రదించాలని ప్రకటించాయి.
ఈమధ్య యూజీసీ కూడా సైబర్ నేరాలు నుండి తమను తాము విద్యార్థులు ఎలా కాపాడుకునేందుకు కావలసిన సూచనలతో ఒక హ్యాండ్ బుక్ ని కూడా తయారు చేసి విద్యార్థులకు ఆన్లైన్లో ఈ బుక్ రూపంలో పెట్టింది.
ఇదివరకు కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఫోన్ కాల్ ముందు కోవిడ్ నుంచి ఎలా కాపాడుకోవాలో సూచనలు ఇచ్చేవారు. అదే విధంగా ఇప్పుడు ప్రతి మల్టీమీడియా చానల్స్ లో, టీవీ చానల్స్ లో. ఫోన్ కాల్ ముందు, ఈ క్రింది సూచనలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈ సూచనలు పోస్టర్ల పై ప్రింట్ చేసి ప్రతి చోట ముఖ్యంగా పల్లెటూర్లలో కూడా అతికించాలి.
ప్రజలు సైబర్ క్రైమ్ నుండి తమను తామ రక్షించుకునేందుకు తీసుకోవాల్సన అతి ముఖ్యమైన జాగ్రత్తలు: 1. తెలియని వారి నుండి అంటే ఫోన్లో కాంటాక్ట్స్ లేని వారి నుండి వస్తే ఎత్తకూడదు. 2. పెట్టుబడులు పెట్టుమని వచ్చి ప్రకటనలు నమ్మకూడదు. 3. ఒకవేళ అనుకోకుండా తెలియని వారి నుంచి వచ్చిన ఫోన్ ఎత్తిన వారు బెదిరిస్తే బెదిరింపులకు భయపడకూడదు. ఫోను కట్ చేయాలి.4. పోలీస్ అని డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ చేస్తే ఒకవేళ ఫోన్ చేసే వాళ్ళు వాట్సాప్ లో వీడియో ద్వారా గాని పోలీస్ డ్రెస్సులు వేసుకొని కానీ లేక పోలీస్ డ్రెస్ ఫోటో తోని కాల్స్ వచ్చిన ఎత్తకూడదు. 5. ఒకవేళ మీ కాంటాక్ట్స్ లో లేని వారి నుండి ఫోన్ వస్తుందని మీరు కనుక ఎదురు చూస్తుంటే ఆ ఫోన్ ఎత్తి మీరు అనుకున్న వారి నుండి ఫోన్ అయితేనే మాట్లాడండి లేకపోతే కట్ చేయండి. 6. ఆన్లైన్ గేమ్స్ అసలే ఆడకుండి. 7. ఆన్లైన్ లోన్స్ ని అసలే తీసుకోకూడదు. 8. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ లో తక్కువ డబ్బు ఉంచుకోండి. 9. ఓటీపీలు ఎవరితో షేర్ చేయకూడదు. 10. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, పాస్వర్డ్లు, మీ ఆస్తుల వివరాలు, మీ క్యాష్ బ్యాలెన్స్ వివరాలు ఏవి కూడా సెల్లో స్టోర్ చేయకండి. 11. ఫోన్ ద్వారా మీకు పంపించినటువంటి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయకూడదు. 12. మీకేదో లాటరీ వచ్చిందని దానికి కొంత డబ్బు ఇస్తే మొత్తం డబ్బు పంపిస్తామని అటువంటి సమాచారాలు నమ్మకండి. 13. అతి తక్కువ సమయంలో ఏ బ్యాంకు ఇవ్వలేని వడ్డీ శాతం అంటే సంవత్సరానికి 24 శాతం అంతకన్నా ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్తే అలాంటివి నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు.14. బ్యాంకులు, పోలీసు శాఖ వారు, ఇన్కమ్ టాక్స్ శాఖ వారు, ఇతర ప్రభుత్వ సంస్థలు గాని మీ బ్యాంకు వివరాలు అడగవు. కాబట్టి ఈ సంస్థల నుండి ఫోన్ ఎవరు చేయరు. అలా చేస్తున్నామని చెప్పిన వారికి వివరాలు ఇవ్వకూడదు.15. మీరు చూసే రీల్స్ లో గాని లేక ఇతర వీడియోస్ లో గాని మీకు ఉపయోగపడుతుందని మీకు సహాయం చేస్తామని ఏమైనా లింక్స్ ఇస్తే వాటిని క్లిక్ చేయకూడదు. 16. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటివారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆఫీసు చూపెట్టి డబ్బులు అడిగినా వారిని నమ్మకూడదు. ఒకవేళ ఇలాంటి అవకాశాలు ఆన్లైన్లో ఉంటే అసలే నమ్మకూడదు.
ప్రభుత్వ సంస్థలు కూడా ముఖ్యంగా పోలీసు సంస్థలు ఇలాంటి మోసపూరిత సంస్థల వివరాలు సేకరించి ప్రజల్ని అప్రమత్తం చేయాలి.
వాట్సప్ సంస్థ కూడా ఒక వినియోగదారిని కాంటాక్ట్స్ లో లేని వారి నుండి వీడియో, కాల్స్ వస్తే వాటిని కట్ చేయాలి. అలాంటి కాల్స్ను రిసీవ్ చేసుకుని ఆప్షన్ సెట్టింగ్స్ లో ఉంచాలి.
ప్రజలు మరియు ప్రభుత్వ ఇతర సంస్థలు కూడా ఒకవేళ వారి ఫోన్ చేసే వ్యక్తి కాంటాక్ట్స్ లో నెంబర్ లేదు అని తెలిస్తే, ముందు వారికి మెసేజ్ పంపి ఎందుకు ఫోన్ చేస్తున్నారో కారణం తెలిపి ఫోన్ చేస్తే అప్పుడు అలాంటి ఫోన్స్ ని ఎలాంటి సంకోచం లేకుండా ఎత్తే అవకాశం ఉంటుంది.
డాక్టర్ మండవ ప్రసాద్ రావు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box