ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులు.
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన నేపథ్యంలో థాంక్యూ సీఎం సార్ అంటూ హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు.
విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్న సీఎం.
సొంత హాస్టల్ భవనం నిర్మించాలని కోరిన విద్యార్థులు.
స్థానిక అధికారులతో స్థల సేకరణ చేయించిన అనంతరం స్వంత హాస్టల్ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం.
*విద్యార్థులనిద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ..*
గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది.
ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.
ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం.
త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.
యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలి.
స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించాలి.
ఇది యువతరంపై ఉన్న అతి పెద్ద బాధ్యత... యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దు.
గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరం.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దు...
విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దంకండి..
రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు.
విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమే..
చదువుకున్న వారు ప్రయోజకులు అవుతారు..
సామాజిక స్పృహతో సమాజానికి సేవచేసే వారు మాజంలో హీరోలు అవుతారు..
పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలి.
ఉన్నత చదువులు చదువుకుని... తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box