మామునూరు నుండి ఎగరనున్న విమానాలు


           


                                                                                  *వరంగల్  ప్రజలకు తీపి కబురు అందించిన మంత్రి కొండా సురేఖ*

*వరంగల్ ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టు కల సాకారం కానుందన్న మంత్రి*

*ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేసే దిశగా సీఎంతో చర్చిస్తానన్న మంత్రి సురేఖ*

*అత్యుత్తమ నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించిన మంత్రి*

*జిడబ్ల్యుఎంసి మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రత్యేక అధికారి నియమించాలని ఎంఎయుడి ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు*



                                                                                            వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు  అంగీకరించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి త్వరలోనే మామునూరు ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని అన్నారు. 


ఈ రోజు మర్రిచెన్నా రెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధి పై కూలంకషంగా చర్చించారు. మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్), అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్), అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాజీపేట రోడ్ ఓవర్ బ్రిడ్జ్, భద్రకాళి దేవాలయ మాఢవీధుల పనుల పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత, కూడా పరిధి విస్తరణ, జిడబ్ల్యుఎంసి మాస్టర్ ప్లాన్  తదితర అంశాల మంత్రులు విస్తృతంగా చర్చించారు.  


ఈ స‌మావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి,  పార్ల‌మెంటు స‌భ్యురాలు క‌డియం కావ్య‌, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌,  ఎమ్మెల్యేలు క‌డియం శ్రీ‌హ‌రి, రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, కె.నాగ‌రాజు, నాయిని రాజేంద‌ర్ రెడ్డి, వ‌రంగ‌ల్ మేయ‌ర్ శ్రీ‌మతి గుండు సుధారాణి,  ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌, రోడ్లు , భ‌వ‌నాల శాఖ కార్య‌ద‌ర్శి  హ‌రిచంద‌న‌, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల క‌లెక్ట‌ర్లు స‌త్య‌శార‌ద‌, ప్రావీణ్య, జిడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ, పలువురు  అధికారులు పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, వరంగల్ నగర పురోభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్ట్ కు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఇప్పటికే జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ప్యాసింజర్ సర్వీసులతో పాటు కార్గో సేవలు అందించే దిశగా మామునూరు ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని మంత్రి సురేఖ చెప్పారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు పై మంత్రులు చర్చించారు.   కార్గో సర్వీసులు అందుబాటులోకి వస్తే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఉత్పత్తుల రవాణాకు,  వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల రాకపోకలకు ఉపయుక్తంగా వుండి వరంగల్ నగర పురోగతి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఊతంగా నిలుస్తుందని 

మంత్రి సురేఖ స్పష్టం చేశారు. 


ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌ను  త‌మ ప్ర‌భుత్వం కొలిక్కి తెచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నదని మంత్రి సురేఖ తెలిపారు. జిడబ్ల్యుఎంసి మాస్టర్ ప్లాన్ ను వేగంగా అమలుచేసేలా ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి సురేఖ, వరంగల్ ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ను ఆదేశించారు. అభివృద్ది ప‌నుల వేగం పెంచాల‌నీ, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారుల‌ను నిర్దేశించారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్, ఔట‌ర్ రింగ్ రోడ్‌ పనులు కట్టుదిట్టంగా చేపట్టాలని, వీటికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని అధికారులకు మార్గనిర్దశనం చేశారు. 41 కిలోమీట‌ర్ల వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డును మొద‌టి ద‌శ‌లో 20 కి.మీలు, రెండ‌వ ద‌శ‌లో 10 కి.మీలు, మూడ‌వ ద‌శలో 9 కి.మీల రోడ్డు పనులు చేపట్టేలా ప్రణాళికను అమలు చేయాలని మంత్రులు సూచించారు. ఇందుకు 911 ఎకరాల భూసేకరణ చేయాల్సి వుందని అధికారులు తెలిపారు. భద్రకాళీ దేవాలయానికి అనుబంధంగా వున్న భ‌ద్ర‌కాళి చెరువు పూడిక‌తీత ప‌నుల‌ను వెనువెంటనే ప్రారంభించాలని మంత్రులు అధికారులకు సూచించారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ డిపిఆర్ ను వెంటనే సిద్ధం చేసి, వేగంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. సీఎం రేవంత్  రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నెలలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు