ఒక్క సంతకం తో పాలమూరుకు అన్ని సమాకురుస్తా - సీఎం రేవంత్ రెడ్డి

 




స్వంత జిల్లా పాలమూరులో జరిగిన రైతు పండుగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భావొద్వేగ ప్రసంగం చేసారు. అష్ట కష్టాలతో గోస పడ్డ పాలమూరు సమస్యలన్నీ తీరుస్తా నని అన్ని పనులు ఒకే ఒక్క సంతకం తో పూర్తి చేస్తానని అన్నారు.


నవంబర్ 30, 2023కు  దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉందని అన్నారు. పోలింగ్ బూత్ లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది పూర్తయిందని గుర్తు చేసారు.


రైతు బిడ్డగా కొండారెడ్డి నుంచి బయలుదేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చా..

నాకు ముఖ్యమంత్రి పదవి ఆశామాషీగా వచ్చింది కాదు.. ఇది ఒక బాధ్యత...



బీఆరెస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో మీరు గమనించండి..


పదేళ్లలో వాళ్ళు ఏం చేశారో నాకంటే మీకే ఎక్కువ తెలుసు..


వాళ్ల పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరిగిందా?.. రైతుకు గిట్టుబాటు ధర లభించిందా?..


వరి వేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి పెద్దమనిషి కేసీఆర్..



కానీ ఈనాడు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి..


రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుంది..


కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66లక్షల ఎకరాల్లో 1 కోటి 50లక్షల వరి ధాన్యం తెలంగాణ  రైతులు పండించారు..


వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ చేసుకుంటున్నాం..


ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ ను రూ.7500 కోట్లకు తెగనమ్మి  ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది11వేల కోట్లే..


ఈ 11 వేల కోట్లలో రూ. 8596 కోట్లు మిత్తికే పోయినయ్.. రైతులకు మీరు చెల్లించింది కేవలం రూ.2500 కోట్లే..


మిస్టర్ హరీష్ రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం..


కేసీఆర్ కు  ఈ వేదికగా సవాల్ విసురుతున్నా.. 25రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన  చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి..


మోదీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి.. చర్చిద్దాం


మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం.


ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి.. అసెంబ్లీలో చర్చిద్దాం..


రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మాది.. 


రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్.. రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్..


కేసీఆర్.. పాలమూరు బిడ్డలు  నిన్ను పల్లకిలో మోస్తే మా గుండెలపై తన్ని వలసలు పెరిగేలా చేసింది నువ్వు కాదా?


ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా  అని కేసీఆర్ అన్నాడు... కానీ పదేళ్ల ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. 


ఇవాళ మేం నారాయణ్ పేట్ -కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే మాత్రం కాళ్లల్లో కట్టెలు పెడుతుండు..


పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డు పడుతున్నారు..


ఎవడో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడంకాదు.. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్నాడు.. 


ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు..


మనకు వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకుందామా?


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోవద్దా?


ఓకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్ని తెచ్చుకుందాం..


ఏడాదికొక 20వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరపున మా మంత్రి వర్గాన్ని నేను అడుగుతా..


ఐదేళ్లలో లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా?


కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తీసుకెళ్లిండు... అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచుకోలేమా..


మిత్రులారా... వాళ్ల సోయిలో పడి మోసపోవద్దు..


నా ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం కొడంగల్ లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే..


లగచర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించిండ్రు...


వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు... నేను ఆనాడే చెప్పిన వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని..


ఒక్క కేసీఆర్ కే గజ్వేల్ లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది... మా పారిశ్రామిక వాడ కోసం 1300 ఎకరాలు ఉండొద్దా..


ఆనాడు అధికారులపై దాడులు చేసి ఉంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా


అభివృద్ధి జరగాలంటే కొందరు నష్టపోక తప్పదు.. వారికి కావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుంది.. 


వాళ్లకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి... ఇప్పుడు వాళ్ళు వస్తారు.. పోతారు.. కానీ మన ప్రాంతానికి పరిశ్రమలు మళ్లీ వస్తాయా?


ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం పరిస్థితే మారుతుంది... అలాంటి అవకాశం మీరు కోల్పోవద్దు..


కేసీఆర్ నీ మొసలి కన్నీరు పాలమూరు జిల్లాపై కాదు..


నేను ఇక్కడ పుట్టినోన్ని.. ఇక్కడి మట్టిలో కలిసే వాణ్ణి.. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది...


పారిశ్రామిక వాడ తెచ్చి 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే జిమ్మేదారి నాది.


మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాణ్ణి కాదు...


తోడేళ్ళు, పులులు ఎన్నో చూశా... మానవ మృగాలు మీరెంత..


పని చేయడమే మనకు తెలుసు.. పనిలోపడి చేసింది చెప్పుకోలేకపోతున్నాం..


మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు..మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్..


ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డిగా మారి అభివృద్ధిని ప్రజలకు చేర్చండి..


నేను  మీవాణ్ణి.. నన్ను ఆశీర్వదించండి... కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టండి..


పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదంటూ సీఎం సభలో హామీ ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు