మహిళలకు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.

 


మహిళలకు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం..

వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం..

డిప్యూటీ ముఖ్యమంత్రి 

బట్టి విక్రమార్క.


మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందని ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు తమ తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒకేరోజు ఆరువేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇందిరా గాంధీ ప్రధానిగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక విప్లవత్మక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 4000 మెగావట్ల సోలార్ పవర్ ఉత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వం మాది అని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  కాలేజీ స్ఫూర్తితో మహిళల సంక్షేమం కోసం నిరంతరం కూచ్చేస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 


వరంగల్ అభివృద్ధి గర్వించదగ్గ విషయం 


పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 


వరంగల్ అభివృద్ధి కి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గర్వించదగ్గ విషయమని 6000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డు అని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నత ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఇందిరా గాంధీ జయంతి రోజున హనుమకొండలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నామని చెప్పారు. ఇంద్ర గాంధీ ప్రపంచంలోనే ఆదర్శమైన నేత అని, ఉక్కు మనిషిగా పేరు గడించాలని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీని కొనియాడారు. 


ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. 


రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 


ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ప్రజలు మోసగించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని తెలిపారు. శివశక్తి మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని వెల్లడించారు. వారి అభ్యున్నతికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని ఇందుకు నిదర్శనమే ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు ధరణి పేరిట వేలాది కోట్లు సహా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తున్నదని ఎక్కడ ఎలాంటి అవినీతికి చోటు లేకుండా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని వెల్లడించారు. ఆర్ గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని టీఆర్ఎస్ బిజెపి తమ ప్రభుత్వంపై విషం చిమ్మడం మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం వేల కోట్లు దోచుకుని పేదలను మోసం చేసిందని ఆరోపించారు. 


అడిగినన్ని వరాలిచ్చే గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 


అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 


వరంగల్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ని ఎన్నిసార్లు కలిసినా చికాకు పడలేదని, అడిగిన అన్ని నిధులు వరాలు ఇచ్చే గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత రేవంత్ రెడ్డి అని తెలిపారు. వరంగల్ అభివృద్ధికి ఆరువేల కోట్లు మంజూరు చేయడం అద్భుతమని పేర్కొన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గత బిఆర్ సర్కార్ అనేక హామీలు ఇచ్చి వరంగల్ నగరాన్ని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం అలా కాకుండా నిధులు మంజూరు చేసి పనులు చేసి చూపిస్తుందని తెలిపారు. వరంగల్ కు ఎయిర్పోర్టు కల నెరవేరిందని ఇది భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని చెప్పారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఇక్కడికి అనేక పరిచయం రావడంతో పాటు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. హైదరాబాదు తో పోటీపడేలా వరంగల్ నగరం ముందుకు పోతుందని ఇందుకోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు