రాజ్యాంగానికి అధీకరణ

 


*_రాజ్యాంగానికి అధీకరణ.._*

*_ఆధనీకరణ..!_*


+++++++++-+++++++++


*_రాజ్యాంగ దినోత్సవం_*


✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽


ప్రపంచంలోనే 

అతి పెద్ద 

ప్రజాస్వామ్య దేశమైన 

నా దేశంలో 

అత్యంత పవిత్రమైన

గ్రంథం *_రాజ్యాంగం_*

అదిప్పుడు జవసత్వాలు

ఉడిగిన అంగం..

ఆ రాజ్యాంగానికి మరోపేరే 

రాజకీయాంగం..

కుయుక్తుల చదరంగం..

*_చెద రంగం..!_*


మహోన్నత ఆశయంతో

అంబేద్కర్ బృందం 

రచించిన మహాగ్రంథం..

రాజకీయ ప్రయోజనాల కోసం నలిగి..చిరిగి..

దిక్కుతోచక మిగిలిన

*_వ్యవస్థ..అదెంత అవస్థ!_*


ప్రశ్నించే హక్కు..

వాక్ స్వాతంత్రం..

ప్రజలే పాలకులు..

ఆ ప్రజల పేరునే పాలన..

ఇలాంటివేగా 

ప్రాథమిక సూత్రాలు..

ఈ దేశం తానే రాసుకున్న

రాజ్యాంగం..ఓ ఉద్గ్రంధం..

ఎప్పటికప్పుడు అధీకరణలు..

నీ కోసం నా కోసం కాదు

పాలకుల సౌకర్యం..

వారి కైంకర్యం..

ఇంకెక్కడి సామాన్యుడి 

కలల సాకారం..

శిథిలమైపోయిన

ప్రజాస్వామ్య ప్రాకారం!


నాలుగు స్తంభాలన్నారు..

నాలుగు స్తంభాలాట 

ఆడేస్తున్నారు..అడిస్తున్నారు  

సమధర్మం..సమన్యాయం..

సమసమాజం..

అవి ఎండమావులై..

పాలకులు వాటిని నవ్యంగా

వర్ణించే కవులై..

తిరగ రాస్తున్నారు రాజ్యాంగం..

యధేచ్చగా సాగిస్తూ

వీరంగం..!


పెద్దోడు మరీ పెద్దోడై..

పేదోడు ఇంకా పేదోడై..

అన్నట్టు..వాడి పేరే పీడితుడు..

ఉచితాలు నేర్పి..

మందు మప్పి..

వ్యవస్థల్ని ఏమార్చి..

ధర్మాన్ని..న్యాయాన్ని పరిమార్చి...పార్టీలు మార్చి..

రాజ్యాంగానికి 

పొడిచేస్తున్నారు తూట్లు..

న్యాయవ్యవస్థ కునికిపాట్లు..

మొత్తంగా ఈ దేశంలో

రాజ్యాంగ హననం..

విలువల ఖననం..!


""""""""""""""""""""""""""""""""""""

నా దేశ 

పవిత్ర రాజ్యాంగానికి

క్షమాపణలతో..


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

     9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు