ఇందిరా మహిళా శక్తి మేళాను సందర్శించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

 




కాళోజి కాలక్షేత్రం ప్రారంభించిన ముఖ్య మంత్రి 


కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
అనంతరం ఆర్ట్స్ కాలేజ్ లో జరిగిన ప్రజావిజయో త్సవ సభలో పాల్గొన్నారు.
హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన
ఇందిరా మహిళా శక్తి మేళాను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు,సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖల  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతరశాఖల ఉన్నతధికారులు,శాసన సభ్యులు, ఎమ్మెల్సీ ఇతర ప్రజాప్రతినిధులతో కలసి సందర్శించారు.



ఈ కార్యక్రమములో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హరీష్,  హనుమకొండ, వరంగల్  కలెక్టర్లు ప్రావిణ్య, సత్య శారద, సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి ఎస్ జగన్ తదితరులు పాల్గొన్నారు.


ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ సభ 

ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలలో భాగంగా వరంగల్ లో ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సభ  జరిగింది. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
 ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
----

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు