హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తాం.. ఇందుకోసం నేను నిద్ర పోను..సీఎం రేవంత్ రెడ్డి

 


హైదరాబాద్ కు దీటుగా 

వరంగల్ ను అత్యుత్తమంగా 

అభివృద్ధి చేస్తాం..

ఇందుకోసం నేను నిద్ర పోను..

మంత్రులు అధికారులను నిద్రపోనివ్వను..

వరంగల్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది..

వరంగల్ అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ రూపురేఖలే మారుతాయ్..

ఆదానీ, అంబానీలను తలదన్నేలా ఉత్తమ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం.. 

.

ఆఖరి శ్వాస ఉన్నంతవరకు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా..

హనుమకొండ లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

సభ సూపర్ సక్సెస్ 

లక్షలాదిగా తరలివచ్చిన మహిళలు ప్రజలు 


వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ రూపురేఖలే మారుతాయని తెలిపారు. 


మంగళవారం సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలకు ముఖ్య మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.  

ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితమని పేర్కొన్నారు.

ఈ అడబిడ్డలు మనసు నిండుగా నన్ను  ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నానని స్పష్టం చేశారు.

ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి శాంతి కుమారి ఉన్నారని, ఇద్దరు మంత్రులుగా కుండా సురేఖ సీతక్క వ్యవహరిస్తున్నారని,

ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.

టాటా బిర్లాలను తలదన్నేల రాష్ట్రంలో ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని చెప్పారు. 

మీరు పూర్తిచేయలేదు కాబట్టే.. మేం కాళోజీ కళాక్షేత్రంను పూర్తి చేశామని వెల్లడించారు.

వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారి పోయాయని తెలిపారు. 

ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా మని పేర్కొన్నారు.

పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు.. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని సవాల్ విసిరారు విసిరారు ముఖ్యమంత్రి.

వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా తీర్చి దిద్దాలని నిర్ణయించామని వెల్లడించారు.

చారిత్రాత్మక వరంగల్  నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతు న్నామని చెప్పారు.


అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు ఆరువేల కోట్లు కేటాయించించామని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని ముఖ్యమంత్రి తెలిపారు.

వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ ఉత్తర అభివృద్ధి జరిగినట్లేనని చెప్పారు.

వరగంల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదని, తెలంగాణ అభివృద్ధి కోసం 24 గంటలు పాటు కష్టపడుతానని పేర్కొన్నారు.

పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు

అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతు న్నారని తెలిపారు. 

పది నెలల్లో ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారని గుర్తు చేశారు. 

రూ.500లకే ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ పొందారని, 

దేశంలో ఎక్కడైనా రూ.500.లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారా? అని ప్రశ్నించారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు 

రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారని,

ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని. 

22లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు 25 రోజుల్లో రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు 


ఆనాడు భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పానని, పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరామని పేర్కొన్నారు. మిగిలిన రైతులందరికీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ మేరకు రుణమాఫీ చేసి తీరామని వెల్లడించారు. 


మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం...


ఈ వేదికగా మాట ఇస్తున్నా... మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది. అని హామీ ఇచ్చారు. తల తెగిపడ్డ ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు 

మాట ఇస్తే తల తెగిపడినా మడమ తిప్పని నైజం మాదన్నారు.


రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు అన్నారు.సోనియమ్మ మా అమ్మ.. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ.. అని తెలిపారు. కాళోజి కల క్షేత్రాన్ని గొప్పగా నిర్మించామని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 


వరంగల్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని, కాకతీయ రాజుల ఏలిన రాజ్యమని, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం ఇతర ప్రముఖమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం తాను నిద్రపోను.. అధికారులు, మంత్రులను సైతం నిద్ర పోనివ్వనని శపధం చేశారు. మమ్మునూరులో ఎయిర్ పోర్టు నిర్మాణంతో వరంగల్ దశ దిశ మారుతుందని పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయని దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని, తెలంగాణలో మాత్రం ఒక హైదరాబాదులోనే ఉందని తెలిపారు. తెలంగాణలోని కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండం ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వశక్తి సంఘాల అభివృద్ధి కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగిస్తామని పేర్కొన్నారు.


ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా వరి పంట పండిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ దేశంలో పండుగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండని విధంగా 65 లక్షల ఎకరాల్లో కోటి 53 టన్నుల వరి ధాన్యం పండిందని ఇది తమ ప్రభుత్వ ఘనతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు