83,64,331 నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి
హైదరాబాద్, నవంబర్ 15 : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన లో నేటివరకు 83 , 64 ,331 నివాసాలలో సర్వే పూర్తి అయింది. దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహింస్తున్న ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1 , 16 , 14 , 349 నివాసాలలో నేటివరకు 83 .64 లక్షలలో 72 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6 వతేదీన ప్రారంభమైన ఈ సర్వే ను జాప్యంలేకుండా సకాలంలో పూర్తి చేయడానికి కృషిచేయాలనిరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.. మొదటి దశలో నిర్వహించిన నివాసాల లిస్టింగ్ లో మొత్తం 1,16,14,349 ఇళ్లకు మార్కింగ్ చేయడమైనదని, ఈ ఇళ్లల్లో ఏ ఒక్క ఇల్లును కూడా వదలకుండా ప్రతీ ఇంటిలో సమగ్రంగా సర్వే ను నిర్వహించాలని స్పష్టం చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 98 .9 శాతం పూర్తి చేసి ప్రధమ స్థానంలో నిలవగా, 95 .శాతం పూర్తితో నల్గొండజిల్లా ద్వితీయ స్థానంలో, 93 .3 శాతం తో జనగాం జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 50 .3 శాతం సర్వీ పూర్తితో జీహెచ్ ఎంసీ చివరి స్థానంలో ఉంది. 61 .3 శాతం తో చివరి నుండి ద్వితీయ స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి, 63 శాతంతో హన్మకొండ, 67 .4 శాతంతో వికారాబాద్ జలాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ సర్వేలో 87 ,807 మంది సిబ్బంది, 8788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. కాగా, ఈ సర్వే కు ప్రజల నుండి స్పందన బాగా ఉందని అధికారులు వివరించారు. 52, 493 గ్రామీణ, 40 ,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92 ,901 బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోంది..ఈ సర్వే ప్రక్రియను పర్యవేక్షించాడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి జిల్లాలకు నియమించారు. క్షేత్ర స్థాయిలో ఈ సీనియర్ అధికారులు కూడా పర్యటిస్తూ సర్వే తీరును సమీక్షిస్తున్నారు. .
----ends
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box