1,08,89,758 నివాసాలలో సర్వే పూర్తి
రాష్ట్రంలో 92 శాతం సర్వే పూర్తి
హైదరాబాద్, నవంబర్ 25 :: సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,17,58,491 నివాసాలు గుర్తించగా, నేటివరకు 1,08,89,758 నివాసాలలో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది. రాష్రం1,లో 13 జిల్లాలు 100శాతం సర్వే పూర్తయింది సంగారెడ్డి 88.1 శాతం మెడ్చల్ మల్కజిగిరి 82.3 శాతం సర్వే పూర్తయింది మిగత 17 జిల్లాలలో 90 శాతానికి పైగ సర్వే పూర్తయింది
జి.హెచ్.ఎంసీ పరిధి లో కూడా సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. జిహెచ్ ఎంసీ పరిధి లో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా నేటి వరకు 19,04,977 సర్వే పూర్తిచేసి 76 శాతానికి చేరుకుంది .
సర్వే పూర్తి అయిన జిల్లాలో డాటా నమోదు ప్రక్రియ కూడ ముమ్మరంగా కొనసాగుతుంది ఇ ప్పటి వరకు 12,85,871 నివాసలకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తి అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్ని జిల్లా ఇన్ చార్జ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు, సర్వే పత్రాలను భద్రంగా ఉంచాలని అధికారులు స్పష్టమైనా ఆదేశాలు జారీ చేశారు .
--------ends
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box