*మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న మూడు రోజుల రైతు పండుగ, రైతు సదస్సు కు విశేషమైన ఆదరణ*
మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న మూడు రోజుల రైతు పండుగ, రైతు సదస్సుకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. సదస్సు రెండవ రోజు ఉమ్మడి జిల్లా రైతులతోపాటు చుట్టు పక్కల జిల్లాల నుండి రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర నీటి పారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసుధన్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి, అచ్చంపేట శాసన సభ్యులు డా. వంశి క్రిష్ణ, నారాయణపేట శాసన సభ్యులు పర్ణిక రెడ్డి, కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ గోపి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్, రాష్ట్ర పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్. హరీష్ , వ్యయసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, ఆదర్శ రైతులు, ఉమ్మడి జిల్లా, చుట్టూ పక్కల జిల్లా రైతులు భారీ సంఖ్యలో హాజరై వ్యవసాయ స్టాళ్లు పరిశిలించడంతో పాటు రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.
------------
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box