తెలుగు సినిమా లతో పాపులర్ అయి తెలుగువారినే కించపరుస్తూ మాట్లాడిన ప్రముఖ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆమెను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసుల సాయంతో కస్తూరిని పట్టుకున్నారు. ఇటీవల హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె.. తెలుగు వారి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తన కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో భయపడిన కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె కోసం పోలీసులు వెతకసాగారు. ఎట్టకేలకు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కస్తూరిని గచ్చిబౌలి నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వారిని ఉద్దేశించి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు సంఘాలు, ప్రముఖులు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. పలు పోలీసు స్టేషన్లలో కస్తూరి మీద కంప్లయింట్స్ చేశారు. చెన్నై సిటీ ఎగ్మోర్‌లోని ఓ తెలుగు సంస్థ ఫిర్యాదుతో అక్కడి పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా కస్తూరికి సమన్లు ఇవ్వడానికి రీసెంట్‌గా పోయెస్ గార్డెన్‌లోని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె మొబైల్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
ఈ కాంట్రవర్సీలో తెలుగు వారిపై కస్తూరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడు పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వాళ్లను ఉద్దేశించి మాట్లాడిన నటి.. ఎప్పుడో దశాబ్దాల కింద రాణుల దగ్గర సేవలు చేసేందుకు వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళులుగా చలామణి అవుతున్నారని అన్నారు. అంతఃపురంలో ఊడిగం చేసేందుకు వచ్చిన వారు ఇక్కడే ఉండిపోయారు అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు అటు చెన్నైతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి. తెలుగు సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికింది. స్టాలిన్ సర్కారు మీద ప్రెజర్ పెరగడంతో సీరియస్‌గా తీసుకొని కేసులు నమోదు చేశారు పోలీసులు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box