ఆమెకు అనితరమా

 


*_ఆమెకు 'అనిత'రమా.._*

*_మీకు అనితరసాధ్యమా..!?_*


చలికాలం వచ్చేపాటికి కూటమిలో వాతావరణం వేడెక్కింది...శీతల పవనాలు

వీచే సమయంలో హీట్ వేవ్ మొదలైంది.తప్పు జరిగిందో లేదో కాని నిప్పు రాజుకుంది..!


ఔను..ఉపముఖ్యమంత్రి 

పవన్ కళ్యాణ్ హోం మంత్రి విషయంలో చేసిన వ్యాఖ్యలు

రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.

అనుభవం లేకనో..

ఏం ఫర్వాలేదనో పవన్ కళ్యాణ్ హూమ్ మంత్రి అనిత వ్యవహారశైలిపై

ఘాటైన విమర్శలు చేసారు.

ఇవి సంచలనమే అయ్యాయి.


ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావించక తప్పదు..

పవన్ ఉప ముఖ్యమంత్రి కావచ్చు..

కాని ఆయన పార్టీ వేరు ..

ఇది నాణేనికి ఒక వైపైతే..

ఇలాంటి అభిప్రాయం సాక్షాత్తు ముఖ్యమంత్రికే ఉన్నా గాని..

పబ్లిగ్గా అనరు..


ఇది కూటమి ప్రభుత్వం..

ఆ కూటమిలోని మూడు పార్టీల్లో ఒకటైన జనసేనకు

పవన్ స్వయంగా అధ్యక్షుడు.

అలాంటి వ్యక్తి కూటమి ధర్మానికి విరుద్ధంగా 

ఇలా ఒక మంత్రి ..

ఆమె మహిళ..

ఆపై దళితురాలు..

ఈ విషయాల్ని ప్రస్తుతానికి పక్కన బెడితే

హోం శాఖకు అధిపతి.

ఇప్పుడంటే రాజకీయ అవసరాల కోసం 

ఉప ముఖ్యమంత్రి పదవులు ఉంటున్నాయి గాని ..నిజానికి ముఖ్యమంత్రి తర్వాత 

పెద్ద హోదా..ప్రోటోకాల్ ఉండేది హోం మంత్రికే..అలాంటి కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి పని తీరుపై..

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఆయన 

ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండవచ్చు గాక..

తొందరపడి బహిరంగంగా విమర్శ చేయడం..

ఎంత కాదనుకున్నా గాని

ఆక్షేపణీయమే..


పవన్ మరిచారో మరి అవగాహన లేదో..

హోం శాఖ మంత్రి అనిత అయి ఉండవచ్చు గాని కీలకమైన 

శాంతి భద్రతల విభాగం

సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అధీనంలో ఉంది.

మరి పవన్ చెబుతున్న వైఫల్యం ఎవరిది..అప్పుడు తప్పించాల్సింది ఎవరిని..!?


పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగలేదు.అవసరమైతే

అనితను తప్పించి తాను హూం మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టి చూపిస్తానని ఆయన అన్నారు.

నిజానికి ఎవరు ఏ మంత్రిత్వ శాఖను నిర్వహించాలి అనేది

కూటమి ప్రభుత్వంలో అయినా గాని ..ఒక్క పార్టీ సర్కారులో గాని పూర్తిగా ముఖ్యమంత్రి

విచక్షణాధికారం..పవన్ పరిధి దాటి మాటాడినట్టు అవడమే గాక కూటమి ధర్మానికి బీటలు వేసినట్టు వ్యవహరించడమే కాక..విపక్షాలు హేళన చెయ్యడానికి మంచి పాయింట్ ఇచ్చినట్టు అయింది.


పవన్ ఉద్దేశం మంచిదే కావచ్చు.. కాని ప్రభుత్వంలో కొన్ని మర్యాదలు ఉంటాయి..

అవి తప్పక పాటించవలసిందే.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత

ఇదే మొదటి సెట్ బ్యాక్..

నో డౌట్..!


కొంచెం తిక్కున్నా 

లెక్క మాత్రం తప్పింది..

అన్ని చోట్లా..ఎల్లవేళలా

గబ్బర్ సింగ్ పాత్ర చెల్లదు..

ఇది సినిమా కాదు..

రాజకీయం..

జల్సా కానే కాదు..సర్కార్..!


*_మా ఊరి ఫేస్ బుక్ నుంచి..!_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు