జగన్ చెబుతున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే

 


నీస్వార్జితంలో  నయాపైసావద్దు

వారసత్వ ఆస్తులు సమానంగా పంచాలన్నదినాన్న కోరిక

జగన్ మోహన్ రెడ్డి శర్మిల మద్య ఆస్తుల పంపకంపోరు

ఆస్తుల పంపకాలపోరుపై  జగన్ వ్యతిరేక మీడియా ఆయినఈనాడు,ఆంధ్రజ్యోతి,టివీఫైవ్ ప్రముఖంగా ప్రపగండ మొదలుపెట్టాయి.

వై.ఎస్.జగన్ మోహన్రెడ్డికి  ఆయన సోదరి శర్మిలకు మద్యఆస్తులపంపాకల పోరు ఆసక్తిగా మారింది.తగాదా ఆఖరికి న్యాయస్థానాలతలుపు తట్టింది. ఈనేపద్యంలో  వై.ఎస్.శర్మిల  సుదీర్ఘ  బహిరంగ లేఖ విడుదల చేసారు.

 

జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసల తర్వాత ఆస్తులు కావాలన్న కోర్కె కూడా లేదని, నా బిడ్డలకు ఆస్తులు చెందాలన్నది దివంగత రాజశేఖరరెడ్డి అభిమతం కనుకే తమ తల్లి విజయమ్మ, తాను తపన పడుతున్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్జితం అని జగన్ చెబుతున్నవన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు. రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడే పంపిణీ చేశారనేది అవాస్తవమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమని బలంగా నమ్మి ఆస్తులు సెటిల్ చేసుకుందామని అంటూనే.. జగన్, భారతీరెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదనే కండిషన్ పెట్టారని షర్మిల అన్నారు. జగన్ ఎవరి కొంగు చాటున ఉండి ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఆస్తుల పంపిణీపై వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డితో వివాదం.. తల్లి, చెల్లిపై జగన్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ కేసు వేసిన నేపథ్యంలో వైఎస్సార్ అభిమానులకు ఆయన సోదరి షర్మిల శుక్రవారం 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. మనవలు, మనవరాళ్లకు సమాన వాటా ఉండాలన్న రాజశేఖరరెడ్డి అభిమతానికి విరుద్ధంగా జగన్ వ్యవహరించారని ఆమె వివరించారు. వాస్తవాలేమిటో వైఎస్సార్ అభిమానులకు తెలియజేయాలనే ఉద్దేశంతో లేఖ రాసినట్లుగా షర్మిల పేర్కొన్నారు.



జగన్ ఆస్తుల్లో వాటా అడగలేదు కదా

స్వార్జితం అంటూ జగన్ చెబుతున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. మా తాతల ఆస్తి చిన్నప్పుడే పేరిట పెట్టినంత మాత్రాన.. అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఇతరులతో వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. జగన్ ఆస్తుల్లో నేను వాటా అడుగుతున్నాననేది హాస్యాస్పదం. అవన్నీ బిడ్డలకు చెందాలనేది రాజశేఖరరెడ్డి అభిమతం కనుక అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యిసార్లు అడిగి ఉంటుంది. వందలకొద్దీ లేఖలు రాసింది. అయినా ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు.

జగన్ కోసం శక్తికి మించి చేశా

'రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఇబ్బందులు పడితే.. శక్తికి మించిన సాయం చేశాను. నా బిడ్డలను సైతం పక్కన పెట్టి జగన్ పార్టీని నా భుజాలపై మోశాను. పదేళ్లు నా అవసరం ఉందనుకున్నారేమో బాగానే చూశారు. చిన్న పిల్లలు నలుగురూ సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చామని చెబుతున్నది అందులో భాగమే. నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీల్లోని డివిడెంట్లో సగం వాటా నాకు ఇచ్చారు. తప్పితే ఉపకారం కానేకాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. అది కూడా అప్పుగా చూపించమన్నారు.



సీఎం అయ్యాక మారిపోయారు

జగన్ 2019లో సీఎం అయ్యాక గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. నన్ను చిన్నచూపు చూడటమే కాకుండా సీఎం అయిన నెల రోజులకే విడిపోదామని ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. అమ్మా, నేను వద్దని చెప్పినా ససేమిరా విడిపోవాల్సిందేనని పట్టుబట్టారు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మమన్నారు. వచ్చాక భారతి సిమెంట్స్, సాక్షిలో ఎక్కువ వాటా కావాలని అడిగారు. నేను 60 తీసుకుంటా.. నీకు 40 ఇస్తా అని చెప్పారు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే 5% నుంచి 10% ఎక్కువ తీసుకో కానీ 20% ఎక్కువ అడగడం అన్యాయమని అమ్మ చెప్పింది. అయినా అంతే అని బుల్డోజ్ చేశారు. తర్వాత అర్ధగంటలో సాక్షిలో 40%, భారతి సిమెంట్స్ వాళ్ల 49 శాతంలో 40%, సరస్వతి పవర్లో 100%, యలహంక ప్రాపర్టీలో 100%, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి వచ్చాయి. కొద్దివారాల్లోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) తయారైంది. సరస్వతి షేర్స్, యలహంక ప్రాపర్టీ ఎటాచ్ కాలేదని, వెంటనే రాసిస్తామని.. మిగతా ఆస్తులు కేసులు పూర్తయ్యాక బదిలీ చేస్తామంటే సంతకాలు పెట్టాం. జగన్ది పైచేయిగా ఉంది కాబట్టి.. వాళ్లు రాసిన దానిపై అమ్మ నన్ను సంతకం పెట్టమని చెప్పింది. ఎంవోయూపై సంతకం పెట్టిన ప్రకారం సరస్వతి, యలహంక ప్రాపర్టీలను 2019లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈరోజు ఇవ్వలేదు. అమ్మ గట్టి ఒత్తిడి మేరకు క్లాసిక్, సండూర్ హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ను 2021లో కొనుక్కోడానికి అంగీకరించారు. తర్వాత వాళ్ల వ్యక్తిగత షేర్లు అమ్మకు గిఫ్ట్ ఇచ్చారు.

వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.

జగన్కు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశానని నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా.. సోషల్ మీడియాలో ఉచ్చం, నీచం లేకుండా.. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ననే ఇంగితం కూడా లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నన్ను కాదు.. వైఎస్ తమ్ముడు వివేకానందరెడ్డి పర్సనల్ ఫొటోలు సాక్షి మీడియాలో అభ్యంతరకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయాక.. ఆ ఓటమికి నేను కారణమని వాళ్లు బలంగా నమ్మారు కాబట్టే విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని బంధువులను నా దగ్గరకు పంపారు. జగన్ పెట్టిన కండిషన్లకు అంగీకరించలేదని సెటిల్మెంట్ చేయలేదు. కక్ష కట్టి కేసులు వేశారు

నామీద, అమ్మ మీద కక్ష కట్టి మోసం చేసి షేర్లు తీసుకున్నామంటూ కేసు వేశారు. అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి వస్తుందని గమనించి.. బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ ఎటాచ్ అవ్వలేదు. షేర్స్ బదిలీకీ, జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్సీఎల్టీలో జగన్ వేసిన కేసు విషయం బయటకొస్తే వైఎస్ఆర్ కుటుంబం అప్రతిష్టపాలై యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే.. అమ్మ ఎంతో క్షోభపడుతోందని మేమే విషాన్ని గొంతులో దాచుకున్నట్లుగా దాచుకున్నాం. ఏ కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి ఇది. విలువలు, కుటుంబం కోసం పాటు పడే రాజశేఖర్రెడ్డి కుమారుడే సొంత తల్లిని కోర్టుకు ఈడ్చడం ఎంత అవమానం! అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం. నాపక్కనే నిలబడి మాట్లాడలేని వేదనతో నిండిన మా అమ్మను మరింత బాధపెట్టకూడదని.. అన్యాయంగా మాపై వేసిన కేసు సంగతి ఎక్కడా బయట పడకుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేశాం. జగన్ కేసు వేసిన నెల రోజులకు ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి జగన్మోహన్రెడ్డి కారణమని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన ఆయన.. మమ్మల్ని మోసం చేసిన వాళ్లుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా? జగన్కు నేను లేఖ రాస్తే.. అది తెదేపా హ్యాండిల్ పోస్ట్ అయితే.. నాకు ఏం సంబంధం? నా వరకు నేను గానీ, నా మనుషులు గానీ బయటపెట్టలేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలం' అని షర్మిల అన్నారు.

వ్యాపారాలు జగన్ సొంతం కాదు..

"నాన్నకు నేనంటే ప్రాణం. అంతేకాదు నలుగురు మనవలు, మనవరాళ్లు తనకు సమానం అనేవారు. అందువల్ల రాజశేఖరరెడ్డి బతికి ఉండగా నెలకొల్పిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో వారికి సమాన వాటా ఉండాలి. వ్యాపారాలు జగన్ సొంతం కాదు. వాటికి ఆయన గార్డియన్ మాత్రమే. అన్ని వ్యాపారాలను సమానంగా పంచి ఇవ్వడం జగన్ బాధ్యత. వైఎస్సార్ ఉద్దేశం భార్య విజయమ్మకు, సన్నిహితులైన కేవీపీ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికీ తెలుసు. నాన్న బతికి ఉండగా నెలకొల్పిన వ్యాపారాల్లో సరస్వతి పవర్, భారతి సిమెంట్స్ అయినా.. సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ.. ఇలా ఏమైనా (సండూర్ మినహా) వైఎస్ నలుగురు మనవలకు సమాన వాటా ఉండాలి. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు కానీ, మరణించాక కానీ పంపకాలేమీ చేయలేదు. న్యాయంగా దక్కాల్సిన ఒక్క ఆస్తి కూడా ఈరోజు వరకు నా చేతుల్లో లేదు.

సొంత తల్లికే బతుకు మీద విరక్తి కలిగించారు

'ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం, వైఎస్ఆర్ పరువు కోసం ఎంవోయూ వివరాలు బయట పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఎంవోయూ ఇప్పుడు బయటకు వచ్చిందన్నా.. పరస్పరం రాసుకున్న లేఖలు బయటకు వచ్చాయన్నా.. ఎన్సీఎల్టీలో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బతుకు మీద విరక్తి కలిగించి వైఎస్ఆర్ అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురి చేసింది ఎవరో మీకు తెలుసు' అని షర్మిల పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు