కిట్స్ లో విద్యార్థి సాంకేతిక సింపోజియం సమ్శోధిని24 ప్రారంభోత్సవం

 


కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో  జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం "సమ్శోధిని'24"  ప్రారంభోత్సవం


కిట్స్ వరంగల్ లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐ యస్ టి ఈ) కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్,  కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు), టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్)తో పాటుగా 10 విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం  "సమ్ శోధిని'24"  శుక్రవారం ప్రారంభమయింది.
అక్టోబర్ 18 నుండి 19 వరకు రెండురోజుల పాటు సింపొజియం జరుగుతుందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.
సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హైదరాబాద్ జిఇ ఎలక్ట్రికల్ ఆర్ అండ్ డి, సీనియర్ ప్రిన్సిపల్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్  గౌరవ్ కుమార్ అచ్రా పాల్గొని జ్యోతి వెలిగించి సమ్శోధిని'24"    ప్రారంభించారు.



ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవ్ కుమార్ అచ్రా   మాట్లాడుతూ  స్టార్టప్‌లపై ఇన్నోవేషన్‌, ఇండస్ట్రీ దృక్పథంలోని ముఖ్యాంశాలను వివరించారు.  ఇన్నోవేషన్ అనేది ఆచరణీయమైన కొత్త సృష్టి అని అన్నారు.  నెట్‌ఫ్లిక్స్ అట్లాగే హాట్‌స్టార్ నూతన ఆవిష్కరణలకు ఉత్తమ ఉదాహరణలన్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణ కూడ ఉత్తమ ఉదాహరణ అన్నారు. కొత్త ఆలోచనలతో AIని రూపొందించే సాధనం కూడా ఒక రకమైన సృష్టి (ఉదా, చాట్ GPT). ఇన్నోవేషన్ ఆచరణాత్మకంగా మరియు సాధ్యతకు సంబంధించి స్థిరంగా ఉండాలన్నారు. ముడి చమురు (1.65 లక్షల లీటర్లు) రవాణా కోసం సోలార్ బోట్లను ఆవిష్కరించడం ద్వారా 420 టన్నుల కార్బన్ కాలుష్యాలను నివారించడం గొప్ప ఆలోచన అన్నారు.
ఆలోచనలు సమాజంలో కనిపిస్తాయి మరియు ప్రపంచంలో మార్పును కలిగిస్తాయి. ఆవిష్కరణకు ముఖ్యమైన సమస్యలను గుర్తించడం అవసరం.  తెలంగాణలో టి-వర్క్స్, అతిపెద్ద ప్రోటోటైప్ లాంచింగ్ సెంటర్‌ను రూపొందించిందని  ఇంటర్న్‌షిప్ అవకాశాలను ఉపయోగించుకోవాలని
ప్రపంచంలోని అర్ధవంతమైన మార్పుకు, క్రియాశీలకంగా, చొరవ తీసుకుని, వర్తమానంపై దృష్టి పెట్టడానికి ఆవిష్కరణ అత్యంత శక్తివంతమైన సాధనం అని విశ్లేశించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ  ఈ రకమైన సాంకేతిక సింపోజియంలు సృజనాత్మక ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తాయన్నారు.  సమ్ శోధిని'24" యొక్క థీమ్ "సరిహద్దులు దాటిన ఆవిష్కరణ" అని పేర్కొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఆవిష్కరణ కోసం సాంకేతిక  పరిశోధన ద్వార అన్వేషణ అని  తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తో కూడిన ఇంజనీరింగ్ విభాగాలు,
యం బి ఎ వారు వివిధ సాంకేతకపరమైన వర్క్‌షాప్ లు నిర్వహిస్తారు.
 



కిట్స్ వరంగల్ గవర్నింగ్ బాడీ సభ్యులు మరియు రిటైర్డ్ జడ్జి కె. దేవీ ప్రసాద్  అధ్యక్షోపన్యాసం చేశారు.  ఇది టెక్స్ట్ బుక్ పరిజ్ఞానం ఆచరణాత్మక జ్ఞానంగా రూపాంతరం చెందిన వేదిక గా అవతరించిందన్నారు.  'ఆవశ్యకత ఆవిష్కరణకు తల్లి' అని మరియు ఆవిష్కరణ అనేది ఇంజనీరింగ్‌కు చాలా దగ్గరగా ఉండే పదమని అన్నారు. ఈ సింపోజియం విద్యార్థి సమాజానికి ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందని  సమాజ ప్రయోజనం కోసం సృజనాత్మక ఆలోచనలను పొందాలని ఆకాంక్షిస్తుందని,ఇంటర్ డిసిప్లినరీ ఇంజనీరింగ్ రంగాలలో విద్యార్థి సమూహంలో అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పంచుకోవడానికి నేర్చుకోవడానికి ఇది సాంకేతిక వేదిక  అని వివరించారు.

  రాజ్యసభ మాజీ సభ్యులు కిట్స్ వరంగల్  ఛైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ, వి. సతీష్ కుమార్  కార్యనిర్వాహక సాక్ అధ్యాపక బృందంను, అధ్యాపక సమన్వయకర్తలు, విద్యార్థి సమన్వయకర్తల బృందాన్ని ఇంజినీరింగ్ యం బి ఎ విద్యార్థి నీ విద్యార్థుల ప్రయోజనం కోసం విద్యార్థి సాంకేతిక సింపోజియం "సమశోధిని'24" నిర్వహించినందుకు అభినందించారు.



కిట్స్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ వి.పవన్ కుమార్, డీన్‌లందరూ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ & ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్.  ఎం.  శ్రీలత, అసోసియేట్ డీన్,  ప్రోగ్రామ్ కో-కన్వీనర్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. నరసింహారావు,  ఐ యస్ టి ఈ కిట్స్ చాప్టర్ ఛైర్మన్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డా. టి. మధుకర్ రెడ్డి, కో-కోఆర్డినేటర్స్, డాక్టర్ ఎస్. సునీల్ ప్రతాప్ రెడ్డి & డా. బి. విజయ్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు పిఆర్‌ఓ డా.డి. ప్రభాకరా చారి,  ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐయస్ టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్  ప్రెసిడెంట్ ఎ. అభిచరణ్, టెక్నికల్ క్లబ్ విద్యార్థి ప్రధాన కార్యదర్శులు: నిషాత్ సుల్తానా & వి. సిద్దార్థ, 3000 పైబడిన విద్యార్థులు రెండు రోజుల టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు