ఉద్యమకారుల గర్జనను విజయవంతం చేయండి

 


ఉద్యమకారుల గర్జనను విజయవంతం చేయండి

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర చైర్మన్


      తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలనే డిమాండ్ తో నవంబర్ 3 వ తేదీన హనుమకొండ జిల్లా కేంద్రం పబ్లిక్ గార్డెన్ లోని వేణుమాధవ్ ప్రాంగణంలో జరుగు తెలంగాణ ఉద్యమకారుల గర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామి పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సభ గోడ పత్రికలను విడుదల చేసి ఆయన మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో కలిపిన నాటి నుండి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన దోపిడీ, అణచివేతలపై పోరాటం చేసిన ఉద్యమకారులను, ఉద్యమ కుటుంబాలను గుర్తించి వారికి అన్ని విధాల న్యాయం చేయాలని ఆయన అన్నారు. గడిచిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నా విధంగా ఉద్యమకారులకు అన్ని విధాలుగా సహాయం అందించాలని అన్నారు. ఉద్యమకారులను గుర్తించడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిటీని నియమించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఉద్యమకాలంలో నష్టపోయిన వారిని గుర్తించి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి సంస్థలను స్థాపించి తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టిసి యూనియన్ లను పురరుద్ధరించాలని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా తొలగించిన 469 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనే, తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలనే తదితర డిమాండ్లతో జరుగు ఉద్యమకారుల గర్జన సభకు తెలంగాణ నలుమూలల నుండి ఉద్యమకారులు హాజరై సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 



    ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల జాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారుల పోరాటాలు, వారి ప్రాణ త్యాగాలు లేకుంటే తెలాంగాణ సాధ్యమయ్యేది కాదని అలాంటి త్యాగధనులు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి స్థలాలతో పాటు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందించాలని కోరుతూ జరిగే ఈ సభకు టి జె ఎస్ రాష్ట్ర అద్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, వరంగల్  పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్షలు సాధించుకునే పోరాటంలో కూడా ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. 

    ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక వరంగల్ జిల్లా కన్వీనర్ కోండ్ర నర్సింగరావు, బి ఎల్ ఎఫ్ జిల్లా నాయకులు ఇతమ్ నగేష్, ఆర్టీసీ నాయకులు రవీందర్, తెలంగాణ సాంస్కృతిక విభాగం నాయకులు బుల్లెట్ వెంకన్న, గడ్డం శరత్, బి.సి కులాల  ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సోమిడి అంజన్ రావు, మాజీ కార్పొరేటర్ నయీం, తెలంగాణ ఆకాంక్షల వేదిక నాయకులు అమ్జద్ బేగ్, నవరత్న ఆనంద్, దుర్గదాస్, దార సూరి, మొషిన్, ఏస్ కె బాబు, గోపనబోయిన రాజు, రుద్రోజు నవీన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు