*కంచి విశ్వవిద్యాలయంలో చేరిన 86 మంది తెలంగాణ విద్యార్థులు*
*కంచి స్వామీజీని దర్శించుకున్న ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్*
హైదరాబాద్, అక్టోబర్ 16 : కంచి లోని శ్రీ చంద్ర శేఖరేంధ్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో వివిధ ఉన్నత స్థాయి కోర్సులలో ఈ విద్యా సంవత్సరం తెలంగాణా రాష్ట్రానికి చెందిన 86 మంది చేరారు. వివిధ కోర్సులలో చేరిన ఈ విద్యార్థినీ విద్యార్థులకు కంచి స్వామిజి శంకర విజయేంద్ర స్వరస్వతి ఆశీర్వచనాలు అందచేశారు. . రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ కంచి కామకోటి పీఠానికి వెళ్లి కంచి స్వామీజీ విజయేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రస్తుత విద్య సంవత్సరం కంచి విశ్వవిద్యాలయంలో చేరిన తెలంగాణా కు చెందిన 34 మహిళా విద్యార్థినులు, 52 మంది విద్యార్థులతో శైలజా రామయ్యర్ సమావేశమయ్యారు. కంచి విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతీ, ఇంజనీరింగ్, న్యాయ శాస్త్రం, ఆర్ట్స్, హ్యుమానిటీస్ తదితర విభాగాలలో ఈ విద్యార్థులు చేరారు. వివిధ కోర్సులలో చేరిన తమకు కంచి స్వామీ శంకర విజయేంద్ర స్వరస్వతి ఆశీర్వచనాలు అందచేశారని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన ఈ విశ్వ విద్యాలయంలో అత్యంత నిష్ణాతులైన ఉత్తమ అధ్యాపకులు ఉన్నారని విద్యార్థులు ఆమెకు తెలిపారు. అనంతరం, కంచి చిన్న స్వామీ విజయేంద్ర సరస్వతి ని కలసి వారి ఆశీర్వచనం పొందిన ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, తెలంగాణా విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box