కిట్స్ లో ముగిసిన సమ్ శోధిని 24

 *కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో ముగిసిన  జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం " సమ్ శోధిని'24".



కిట్స్ వరంగల్ లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐ యస్ టి ఈ) కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్,  కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్)తో పాటుగా 10 విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం  "సమ్ శోధిని'24"  ముగిసింది.

రెండురోజుల పాటు అక్టోబర్ 18 నుండి 19 వరకు  "సమ్ శోధిని'24" నిర్వహించారు.



ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ   "సరిహద్దులు దాటిన ఆవిష్కరణ" అనే ఇతివృత్తానికి సంబంధించి సుంశోధిని'24ను ఉత్తమ రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. ఇన్నోవేషన్ ప్రపంచంలో అర్థవంతమైన మార్పును నడిపిస్తోంది అని తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తో కూడిన ఇంజనీరింగ్ విభాగాలు,

యం బి ఎ వారు వివిధ సాంకేతకపరమైన వర్క్‌షాప్ లు నిర్వహిస్తారు.  సుంశోధిని ఫెస్ట్ సందర్భంగా పేపర్ ప్రెజెంటేషన్‌లు అన్ని శాఖలకు సాధారణ  కార్యకలాపం గా గోచరిస్తుంది.  అంతే కాకుండా ప్రాజెక్ట్ ఎక్స్‌పో, ఇన్నోవిజన్, ట్రెజర్ హంట్, 70 పై చిలుకు సాంకేతిక కార్యక్రమాలను  నిర్వహించామని  ఆయన తెలిపారు. 



పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ఇంజనీర్లగా తయారు కావడానికి అంతే కాకుండా అధిక సి టీ సి  ఉపాధిని సాధించడానికి విద్యార్థులు ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఐ 2 ఆర్ ఈ) సంస్కృతి పట్ల మక్కువ కలిగి ఉండాలని, అందుకు నిరంతర సాధన చేయాలి అని ఆయన అన్నారు.

 

ఫెస్ట్ కన్వీనర్  విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొ ఫెసర్ ఎం. శ్రీలత మాట్లాడుతూ  ఈ సింపోజియం విద్యార్థి సమాజానికి ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. సమాజ ప్రయోజనాల కోసం సృజనాత్మక ఆలోచనలను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. సింపోజియం ప్లాట్‌ఫారమ్ వైవిధ్యభరితమైన ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాలలో ప్రతిభను మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అంతే కాకుండా పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ఇంజనీర్‌లను రూపొందించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించింది  అని డీన్ అన్నారు.

సింపొజియం నిర్వహించిన నందుకు విద్యార్థులను అధ్యాపాకులను కాలేజి యాజమాన్యం అభినందనలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో  డీన్‌లందరూ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ & ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్.  ఎం.  శ్రీలత, అసోసియేట్ డీన్,  ప్రోగ్రామ్ కో-కన్వీనర్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. నరసింహారావు,  ఐ యస్ టి ఈ కిట్స్ చాప్టర్ ఛైర్మన్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డా. టి. మధుకర్ రెడ్డి, కో-కోఆర్డినేటర్స్, డాక్టర్ ఎస్. సునీల్ ప్రతాప్ రెడ్డి & డా. బి. విజయ్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు పిఆర్‌ఓ డా.డి. ప్రభాకరా చారి,  ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐయస్ టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్  ప్రెసిడెంట్ ఎ. అభిచరణ్, టెక్నికల్ క్లబ్ విద్యార్థి ప్రధాన కార్యదర్శులు: నిషాత్ సుల్తానా & వి. సిద్దార్థ, 3000 పైబడిన విద్యార్థులు రెండు రోజుల టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు