నా మాటలు వెనక్కి తీసుకుంటున్న -మంత్రి కొండా సురేఖ

 


బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసి మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలు వెనక్కి తీసుకున్నారు.


”సమంత,మీ మనోభావాలను దెబ్బతీయాలని నా ఉద్దేశం కాదని స్పష్టంగా తెలియజేస్తున్నా. మీరు స్వయంశక్తితో ఎదిగిన తీరు నాకు ఎంతో ఆదర్శంగా ఉంది,” అంటూ  ఎక్స్ లో ట్వీట్ చేసారు.
బిజెపి ఎంపి రఘునందన్ రావు మంత్రి సురేఖ మెడలో  నూలు పోగుదండ వేసిన ఫోటో పై సామజిక మాధ్య మాల్లో బి ఆర్ఎస్ సానుకూల వ్యక్తులు ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు.


దీనిపై అనేక మంది స్పందించి మంచి సంప్రదాయం కాదని విమర్శించారు. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ పట్ల సానుభూతి వ్యక్తం అయ్యింది.
కేటీ ఆర్ మినహా ఆ పార్టీ లో చాలా మంది కూడ ట్రోల్స్ ను వ్యతిరేకంచారు.
కానీ కొండా సురేఖ కేటీఆర్ పై సహనం కోల్పోయి సమంతను ఈ ఇషులో లాగడం తీవ్ర డుమరానికి దారితీసింది. కొండా సురేఖ పై ఉన్న సానుభూతి కాస్త తెరమరుగయ్ విమర్శలకు గురయ్యారు.
దాంతో మంత్రి కొండా సురేఖ సమంతనుద్దేశించి  చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు దిద్దుబాటు చర్యకు ఉపక్రమించారు.
మంత్రి కొండా సురేఖ దిద్దుబాటు చర్య లను అందరు స్వాగతించించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఇవి ఎప్పటికయినా ప్రజజీవితంలో ఉండేవారికి డామేజ్ కలిగిస్తాయని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేసారు.
సామాజిక మాధ్యమాల్లో అడ్డు అదుపులేని విచ్చలవిడితనం సమాజానికి హానికరంగా మారింది. అందుకుతోడు నాయకుల వ్యవహారం కూడ ఆజ్యం పోసినట్లుగా తోడుకావడం వల్ల సామజిక మాధ్యమాలు పెంట పెంటగా మారాయి అనేది వాస్తవం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు