మనింటి..కొడవటిగంటి

 



*_మనింటి..కొడవటిగంటి..!_*


________________________


_కుటుంబరావు జయంతి_

      28.10.1909


#################


నేను కుకుని చదవలేదు..

ఇలా చెప్పడం అవమానంగా 

భావించే తరం..

అలాని చదవకుండా చదివేసినట్టు 

డబ్బాలు పోతే

ఊరుకునే రకం కాదీ

కొడవగంటి..

ఎక్కడో ఒక దగ్గర 

నిన్ను పలకరించి...

నీ చేతిని అలంకరించి..

నీచే చదివించి నీలో

ఎంతో కొంత జ్ఞానాన్ని నింపేదే

కుటుంబరావు రచన..

నిజానికి ఆయన్ను చదవకపోతే 

నీలో నువ్వు మైనస్సే..

ఆయన పుస్తకం నీ అడ్రస్సే!


నీకు పేపర్ చదివే అలవాటుంటే 

కొడవటిగంటి

నీ ఇంటి చుట్టమే..

నవల నీ కలయితే

దాన్ని చదివించడం

ఆయన కళ..

కథ నీకు నచ్చితే

నువ్వు ఆయన్ను మెచ్చినట్టే..

నాటిక నీ వాకిట ఆడినట్టే..

నీ సమస్యలే..

నీ చుట్టూ జరిగే 

సంఘటనలే...

నువ్వు రోజూ చూసే ఉదంతాలే..

నీ కథలే..నా వ్యధలే

కుకు ఇతివృత్తాలు..

నిన్ను కట్టిపడేసే వృత్తాంతాలు..!


ఉత్తరాలతో మొదలైన 

కుటుంబరావు చిత్తరాలు

కధలై..కవితలై..నాటికలై..

గల్పికలై..సినిమా వర్ణనలై..

చరిత్రగా..శాస్త్రంగా..

సంస్కృతిగా ఆకృతి దాల్చి

నిన్ను ఒప్పించి మెప్పించి

ఇదిరా కుకు శైలి..

నీ..నా అభిరుచుల వాకిలి..!


ఆయన రచనల వేదిక

మధ్యతరగతి మనిషి వాకిలి

విభిన్న అనుభవాల..

అనుభూతుల లోగిలి..

నీకు తెలిసిన విషయాలే..

కాని ఆ చెప్పే రీతి..

నీకే అబ్బురమనిపించే 

నిరతి..కుకుకి పట్టేసింది

అభిమానలోకం 

అక్షరాల హారతి..!


గురజాడ..చలం..శ్రీపాద..

మల్లాది..వీరి నేతృత్వంలో

సాగిన సాహితీ జడి..

కొడవగంటి 

ఆ తరం అనంతరం 

పుట్టుకొచ్చిన అలజడి..

ఆ కాలంలో 

ఆయన కథకుడు...

ఆయనే కథానాయకుడు..

నమ్మింది రాయడం..

హేతుబద్ధ వివరణతో

నిన్నూ నమ్మించడం

కుటుంబరావు శిల్పం..

అలా రాయడంలో

ఆయన ప్రతిభ అనల్పం..

రాయడమే సంకల్పం..

అలా రాయడంతోనే

తరిగిపోని 

కీర్తి అయింది 

ఆయన ఇంట

హంసతూలికా తల్పం..!


రచన ఆయన వ్యాసంగం

పుస్తకంతోనే పరిష్వంగం..

నీ ముందు తరాన్ని..

నీ తర్వాతి తరాన్ని..

రేపటి తరాలను

జాగృతం చేసే అవతారం..

నిజంగా అలా..

ఆయనలా రాయడం 

ఎవరి తరం!?


✍️✍️✍️✍️✍️✍️✍️


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు