కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో విద్యార్థి సాంకేతిక సింపోజియం " సమ్ శోధిని'24" వాల్ ఆర్ట్ ఆవిష్కరణ వేడుక
ఫోటోగ్రఫీ, మీడియా క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) టెక్నికల్ ఫెస్ట్ సమ్ శోధిని'24 సందర్భంగా వాల్ ఆర్ట్‌ను డిజైన్ చేసి పెయింట్ చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.
దీనిని విద్యార్థి ప్రతినిధులతో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి కలిసి డీన్ విద్యార్థి వ్యవహారాల ప్రొఫెసర్ ఎం.శ్రీలత ప్రారంభించారు.
కిట్స్ వరంగల్ లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐ యస్ టి ఈ) కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ వారి యొక్క టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్)తో పాటుగా 10 విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం యొక్క "సమ్ శోధిని'24" నిర్వహిoచారు అని తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, కిట్స్ వరంగల్ ఛైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ, వి. సతీష్ కుమార్ అధ్యాపక బృందంను అట్లాగే పి. యం సి విద్యార్థి సమన్వయకర్తల బృందాన్ని అభినందించారు..
ఈ సందర్భంగా కిట్స్‌డబ్ల్యు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ వైవిధ్యమైన కళాఖండాలను కలిగి ఉన్న వాల్ ఆర్ట్ ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని, సుంశోధిని’24 ఇతివృత్తం “సరిహద్దులు దాటి ఆవిష్కరణ”. దీనిని ఫోటోగ్రఫీ మరియు మీడియా క్లబ్ విద్యార్థులు రూపొందించి చిత్రించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీన్‌లందరూ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ ప్రొఫెసర్. ఎం. శ్రీలత, అసోసియేట్ డీన్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. నరసింహారావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు పిఆర్‌ఓ డా.డి. ప్రభాకరా చారి, ఐ యస్ టి ఈ కిట్స్ చాప్టర్ ఛైర్మన్ డా. టి. మధుకర్ రెడ్డి, ఫోటోగ్రఫీ & మీడియా క్లబ్ విద్యార్థి ప్రతినిదులు వరుసగా ప్రధాన కార్యదర్శి - కిరిల్ ప్రవర్ష్ మోజెస్, సంయుక్త కార్యదర్శులు - యస్ స్నేహ, రాహుల్, శశి వర్ధన్, రిషిత్ రెడ్డి, అద్విక్ పటేల్, అనిరుధ్ డాక్టర్ ఎస్. సునీల్ ప్రతాప్ రెడ్డి & డా. బి. విజయ్ కుమార్, ఐయస్ టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్ ప్రెసిడెంట్ ఎ. అభిచరణ్, టెక్నికల్ క్లబ్ విద్యార్థి ప్రధాన కార్యదర్శులు: నిషాత్ సుల్తానా, వి. సిద్దార్థ, 100 పై చిలుకు విద్యార్థులు ఫెస్ట్‌లో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box