ఒరాకిల్ కంపెనీ కిట్స్ వరంగల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులను క్యాంపస్ ఇంటర్వ్యూ లలో ఎంపిక చేసింది. 14.0 ప్యాకేజీతో విద్యార్థులను ఎంపిక చేసుకుంది.
ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మూడు దశలలో ఇంటర్వ్యు లు నిర్వహించి కిట్స్ వరంగల్ క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థులను సంవత్సరానికి 14.0 లక్షల (ఎల్.పి. ఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గా ఎంపిక చేసుకుందని కళాశాల ఛైర్మెన్యం రాజ్య సభ మాజీ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతా రావు తెలిపారు.
సాంకేతిక దిగ్గజ యమ్. యన్. సి. కంపెనీలు రాబోయే రోజుల లో కిట్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు అంగీకరించాయని ఇందుకు ఏర్పాట్లు జరుగు తున్నాయని అయన తెలిపారు.
బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 3 దశలలో ఇంటర్వ్యు లు నిర్వహించారు. ఆకాష్ పున్నం( సిఎస్‌ఇ ) రాకేష్ మామిడి(సిఎస్ యమ్) ఇద్దరు విద్యార్థులు సంవత్సరానికి 14.0 లక్షల (ఎల్.పి. ఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గా ఎంపికయ్యారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి యమ్. యన్. సి లలో జి ఈ , హెయిర్, చబ్ ఇండియా, LTI మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, మొదలగు వాటి తో పాటు ప్రముఖ ఐ టి కంపెనీ లు ప్రాంగణ నియామకాలు చేపట్ట డానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే ఈ డ్రైవ్‌లలో విద్యార్థులు తమ సీనియర్లను అనుకరిస్తు నైపుణ్యా భివృద్ధి నిరంతర ప్రక్రియ గా చేసుకోవాలని ఆయన సూచించారు.
కిట్స్ వరంగల్ కోశాధికారి పి. నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్థిరమైన అభ్యాససం తో పాటు ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యాలలో అభివృద్ధి చెందడం ద్వారా ప్లేస్‌మెంట్‌లను పొందుతారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ, స్వీయ అభ్యాసం మరియు స్వీయ ప్రేరణను అధ్యాపకులు విద్యార్థుల కు అందించడం వలన ఈ విజయము చేకూరిందని అన్నారు. ఈ విజయానికి ప్రధానంగా అధ్యాపకుల బహుముఖ అంతర్గత శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమ నిపుణుల బాహ్య శిక్షణ కార్యక్రమాలు కారణమని, వాటిని ఎప్పటికప్పుడు సాంకేతిక అవసరాల కనుగుణంగా నిర్వహి స్తున్నామని తెలిపారు.
విద్యార్థులు ఎల్లవేళలా తమ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ ఉద్యోగ సముపార్జన లో నిమగ్నము కావాలని కోరారు.
కిట్స్ కళాశాల హుస్నాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, సిఎస్‌ఇ విభాగమ్ హెడ్, ప్రొ. పి నిరంజన్ మరియు సిఎస్ యమ్, విభాగమ్ హెడ్ డాక్టర్ యస్. నర్సింహా రెడ్డి, డీన్ ట్రైనింగ్ & ప్లేస్ మెంట్స్ ప్రొఫెసర్ వై. పురందర్, టి.పి.ఓ. డా. టి. చంద్రబాయి, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ. కిరణ్ కుమార్, పృధివ్‌రాజ్, వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పి ఆర్ ఓ. డా.డి. ప్రభాకరా చారి, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఎంపిక అయిన విధ్యార్ధుల కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box