మైండ్‌ట్రీ లో ఇంటర్న్ షిప్ కు ఎంపి కైన ఐదుగురు కిట్స్ కాలేజ్ ఎంబిఏ విద్యార్థులు

 


మైండ్‌ట్రీ"  ఎంఎన్‌సి కంపెనీలో కిట్స్ కళాశాల కు చెందిన ఐదుగురు ఎంబిఎ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు 


కిట్స్ కళాశాల వరంగల్ కు చెందిన ఐదుగురు ఎంబి ఎ విద్యార్థులు  హైదరాబాద్‌లోని "మైండ్‌ట్రీ"  ఎంఎన్‌సి  కంపెనీలో  ఇంటర్న్‌షిప్‌లను సాధించారు.


ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ ఎంఎన్‌సి మైండ్‌ట్రీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కలగడం సంస్థతో పాటు ఎంబిఎ విభాగానికి ఎంతో గర్వకారణం అన్నారు. ఎంబి ఎ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వినయ్, హరిప్రియ, వాగ్దేవి, మేఘన, హేమ లను ఈ సందర్బంగా  ఆయన అభినందించారు."విద్యార్థుల, అధ్యాపకుల సాంకేతిక మేనేజ్‌మెంట్ నైపుణ్యాభివృద్ధి సామర్థ్య ల కోసం పలు అంశాలపై అవగాహన సదస్సులు కిట్స్ వరంగల్  క్యాంపస్‌లోని  నిర్వహించడం వలన ఈ అవకాశాలు సాధ్యం అయ్యాయని అన్నారు.
ఆధునిక సాంకేతిక రంగాలపై విజ్ఞానంతోపాటు నైపుణ్యాలు  పెంపొందించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన యాజమాన్య సాంకేతిక విజయo గా  నిలచిందని తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు  కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతా రావు,  కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్   మైండ్‌ట్రీ"  కంపెనీలో  ఇంటర్న్‌షిప్‌లను సాధించిన విద్యార్థులను వారికి తోడ్పడిన యం బి ఎ అధ్యాపక సమన్వయకర్తల  బృందాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్  ఎంబిఎ విభాగాధిపతి  డాక్టర్. పి. సురేందర్, శిక్షణ,  ప్లేస్‌మెంట్ అధికారి, డాక్టర్ టి చంద్రబాయి ఆమె బృందం,  కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పి ఆర్ ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, వివిధ విభాగాల విభాగాధిపతులు, డీన్ లు, కిట్స్ వరంగల్  యం బి ఎ విద్యార్థులు,  అధ్యాపకులు, డాక్టర్. జి. రత్నాకర్,  డాక్టర్. సునీత చక్రవర్తి, డా.ఎస్.సారిక, కె. శశాంక్, డా. కె. జైపాల్, శ్రీమతి. టి. త్రివేణి మరియు సిబ్బంది యం బి ఎ విధ్యార్ధులకు శుభా కాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు