గవర్నర్‌తో భేటీ అయిన బీసీ కమిషన్‌*

 


గవర్నర్‌తో భేటీ అయిన బీసీ కమిషన్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు జరగనున్న అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మకు వివరించినట్లు బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్‌ తెలిపారు. అంతకుముందు రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ను బీసీ కమిషన్‌ ఛైర్మన్ శ్రీ జి నిరంజన్ సభ్యులు శ్రీ రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మీ రంగు మరియు బీసీ కమిషన్ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ యు. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి సతీష్ కుమార్ మరియు చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి జి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, సమగ్రంగా సేకరించిన కులాల వివరాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చె నెల 8 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కులాల వారీగా సమగ్రంగా వివరాలు సేకరిస్తామని నిరంజన్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు