కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో బతుకమ్మ వేడుకలు



కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో  బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు.
మ్యూజిక్ డ్యాన్స్, ఫైనార్ట్స్ (ఎం డి యఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, వరంగల్  (కిట్స్ డబ్ల్యు) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకలు ఐషా బ్యూటీ లాంజ్ హన్మకొండ వారు స్పాన్సర్ చేసారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతో పాటు ప్రపంచం వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఖ్యాతి గడించాయని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిస్తూ  విద్యార్థులు పూల పండగ జరుపుకున్నారని తెలిపారు.



రాజ్యసభ మాజీ సభ్యులు కిట్స్ వరంగల్  ఛైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు,కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఫార్మర్ కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ, వి. సతీష్ కుమార్,కార్యనిర్వాహక సాక్ అధ్యాపక బృందంను,మహిళా అధ్యాపకులు అట్లాగే విద్యార్థి బృందాన్ని బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకున్నఅందుకు   అభినందించారు.



కార్యక్రమంలో  డీన్‌లు,  అందరు హెడ్‌లు, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీలత, అసోసియేట్ డీన్ ఎం. నరసింహారావు, ఫ్యాకల్టీ  ఇంచార్జిలు  డా.పి.ఎస్.ఎస్ మూర్తి & డా. సిహెచ్..శ్రీదేవి రెడ్డి, విద్యార్థి ప్రతినిధులు, ఎండీఎఫ్ క్లబ్ ప్రధాన కార్యదర్శులు హెచ్ శ్రీగౌరి జాహ్నవి & ఎం. సాకేత్, పీఎంసీ ప్రధాన కార్యదర్శి రక్షిత్ శర్మ, ఎగ్జిక్యూటివ్ విద్యార్థి సంఘం  సభ్యులు  రాహుల్, సోమ స్నేహ, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ &  పిఆర్‌ఓ, డా.డి. ప్రభాకరా  చారి, అధ్యాపకులు మరియు సిబ్బంది, మరియు 300 పైబడిన విద్యార్థులు  పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు