బి.సి లకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
బి.సి లకు అన్యాయం చేస్తే యుద్ధమే
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
ఇ డబ్లు ఎస్, జి.ఓ 29 రద్దు చేసి, కుల జనగణనపై స్పష్టత కోరుతూ హన్మకొండలో నిరసన దీక్షలో సంఘాల నాయకులు
తరతరాలుగా అణచివేయబడుతున్న బి.సి సమాజాన్ని మరింత అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలో భాగమే ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇడబ్లుఎస్ కు మద్దతు చేకూరే విధంగానే తెలంగాణ ప్రభుత్వం జి ఓ 29 ను తీసుకొచ్చిందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. జి ఓ నెం. 29 రద్దు, ఇడబ్లుఎస్ రద్దు, కుల జనగణన విధి విధానాలపై స్పష్టత కోరుతూ హన్మకొండ జిల్లా కేంద్రం జయశంకర్ పార్కు ధర్నా చౌక్ వద్ద ఆల్ ఇండియా ఒబిసి జాక్, తెలంగాణ పూలే యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. బి.సి ల సమస్య దేశ వ్యాప్త సమస్య అని, ప్రపంచంలోనే అత్యంత పెద్ధ ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 60 శాతం జనాభా కలిగిన బి.సి లు రాజకీయ అవకాశాలు లేక, రాజ్యాంగపరమైన అవకాశాలు ఎంతో నష్టపోతున్నారని, స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా బి.సి కుల జనగణన జరపకుండా దేశాన్ని ఏలిన అన్ని పార్టీలు ద్రోహం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి పొలిటికల్ జాక్ కన్వీనర్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఇడబ్లుఎస్, జి ఓ నెం. 29 రద్దు చేసి బహుజన సమాజానికి న్యాయం చేయకుంటే రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా బి.సి ఉద్యమం చేపట్టి రాజ్యాధికారం చేపడుతామని అన్నారు. బి.సి హక్కుల సాధన ఉద్యమానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, బి.సి ల ఐక్యత కోసం ముందుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పూలే యువజన సంఘాల సమాఖ్య అద్యక్షులు తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ జోడో యాత్రలో సామాజికన్యాయం కోసం రాహుల్ గాంధీ చెప్పిన మాటలను నమ్మి బహుజన సమాజం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిందని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ను మరచి పాలన కొనసాగిస్తుందని, జి.ఓ 29 వల్ల బహుజన ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. సమగ్ర కుల జనగణనపై స్పష్టమైన విధి విధానాలను రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అన్నారు. కుల జనగణన జరిపి జనాభా దామాషా ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్క్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ మాట్లాడుతూ భారతదేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి బి.సి లకు అన్యాయం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం జరపాల్సిన కుల జనగణనను కావాలనే రాష్ట్రాలపైకి నెట్టి బి.సి లకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఇడబ్లుఎస్, మహిళా బిల్లు, రైతు చట్టాల ద్వారా బిజెపి బి.సి లకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయినా బి.సి లకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం దుర్మార్గమని అన్నారు. మహిళా బిల్లులో బి.సి కోటాకై, చట్టసభల్లో బి.సి వాటాకై జరిగే పోరాటంలో బి.సి మహిళలు పెద్ద ఎత్తున కదలి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన దీక్షలో గొల్లపల్లి వీరాస్వామి, నలుబాల రవి కుమార్, నారాయణ గిరి, నలబోల అమర్, తాటికొండ సద్గుణ, కోడిపాక దేవిక, ఎలవర్తి రాధక్క, పద్మజ దేవి, సరోజన, అశ్విని, తెలంగాణ కొమురయ్య, కర్రే చంద్రశేఖర్, అనిశెట్టి సాయితేజ, మామిడి రాకేష్, మాధవి, స్వప్నరాణి, సాత్విక, స్వప్న, ప్రసన్న, ధారబోయిన సతీష్, దొమ్మాటి ప్రవీణ్, కొండి కృష్ణ గౌడ్, రాసూరి రాజేష్, పెద్దోజు వెంకటచారి తదితరులు పాల్గొనగా విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్, ఉద్యోగ సంఘాల నాయకుడు ధారం జనార్ధన్ బహుజన మహనీయులు మహాత్మా జ్యోతి రావుపూలే, సావిత్రి బాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి.పి మండల్ చిత్రాలకు, దీక్ష దారులకు పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించగా జాతీయ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేసారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతం ప్రవీణ్, సోమ రామమూర్తి, బి.సి జాక్ చైర్మన్ తిరునహరి శేషు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యాం యాదవ్, బి.సి ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, గౌడ సంఘం రాష్ట్ర బొనగాని యాదగిరి గౌడ్, ముస్లిం మైనార్టీ నాయకులు నయీం, కె యు విద్యార్థి నాయకులు వీరాస్వామి, బి.సి ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎదునూరి రాజమౌళి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందీప్, వివిధ సంఘాల నాయకులు నేదునూరి రాజమౌళి, కందికొండ వేణుగోపాల్, ఏదురబోయిన రాజు యాదవ్, వళ్ళాల జగన్ గౌడ్, సూరం నిరంజన్, డేవిడ్, యుగెందర్ గౌడ్, పోలపల్లి రామమూర్తి, మాచర్ల శరత్ చంద్ర, శ్రావణ్, న్యాయవాదులు సాంబయ్య, సూర్య ప్రకాష్, రాజేందర్ కుమార్, దేవునూరి అన్వేష్, జె జె స్వామి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box