వరంగల్ లో ఉదయం దినపత్రిక (పూర్వ)పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం

 


వరంగల్ లో ఉదయం దినపత్రిక (పూర్వ)పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం

తెలుగు పత్రికా రంగంలో నూతన వొరవడులతో పరిశోధనాత్మక జర్నలిజానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించిన ఉదయం దినపత్రిక వరంగల్ ఉమ్మడి జిల్లా మిత్ర బృందం ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రత్న హోటల్ లో జరిగింది. 

 వరంగల్ జిల్లాలో 1984 నుండి 1995 వరకు పని చేసిన పాత్రికేయులు పత్రికా పంపిణి భాద్యతలు నిర్వహించిన ప్రతినిధులు సాంకేతిక నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు.

    మూడు దశబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్న ఉదయం మిత్ర బృందం సభ్యులు ముందుగా భద్రకాళి ఆలయం సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 

ఆ తర్వాత వరంగల్  రత్న హోటల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

పత్రికా రంగంలో ఎందరో పాత్రికేయులను తీర్చిద్దిన ఘనత ఉదయం పత్రికకు దక్కుతుందన్నారు.

1984 నుండి 1995 వరకు ఉదయం దినపత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తున్న సమయంలో జరిగిన అనేక సంఘటనలను వివరిస్తూ, ప్రస్తుతం జీవన స్థితిగతులను పరస్పరం పంచుకున్నారు. 

ఉదయం పత్రికలో పనిచేసిన జర్నలిస్టులు ఆ తర్వాత ఇతర పత్రికలలో ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేసుకున్నారు.

ఉదయం దినపత్రికకు వరంగల్ జిల్లాలో అనేక సంవత్సరాల పాటు స్టాఫ్ రిపోర్టర్ గా అట్లాగే జర్నలిస్టుల సంఘానికి జాతీయ నాయకుడిగా పనిచేసి, ప్రస్తుతం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పి . టి.ఐ)కు పాత్రికేయునిగా పనిచేస్తున్న  దాసరి కృష్ణారెడ్డి చొరవతో  సీనియర్ పాత్రికేయులు  కన్నా పరశురాములు,  కూన మహేందర్,  అచ్యుత రఘునాథ్,  పెండెం వేణు మాధవరావు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసారు.



రోజంతా  ఆత్మీయంగా జరిగిన ఈ సమావేశంలో అందరికీ జర్నలిజంలో  దాసరి కృష్ణారెడ్డిని ఉదయం (పూర్వ) పాత్రికేయులు ఘనంగా శాలువాతో సత్కరించి సన్మాన పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఇలాగే కలుసుకోవాలని, అందరి సంక్షేమం కోసం ''ఉదయం" సంక్షేమ నిధి పేరిట ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సమ్మేళనంలో పాల్గొన్న వారందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

  ఈ అపూర్వ (పూర్వ) ఉదయం పాత్రికేయుల సమ్మేళనంలో వరంగల్డా, హన్మకొండ లో పత్రిక పంపిణి భాద్యతలు నిర్వహించిన ప్రతినిధులు రాధా కృష్ణ, రామ్మూర్తి, జర్నలిస్టులు డాక్టర్ సి. వి. అప్పారావు,  సత్యనారాయణ,  అయినవోలు కృష్ణమూర్తి,  రాజమౌళి, భాస్కరాచారి,  సదానందం,  ఆదినారాయణ,  మురళి,  వెంకటేశ్వర్లు,  సదాశివ్,  గొడుగు శ్రీనివాస్,  మోహన్ రెడ్డి,  సూర్య ప్రకాష్,  రమేష్, సంపత్,  వాడపల్లి అజయ్ బాబు,  ఆర్.లక్ష్మణ్ సుధాకర్ లతోపాటు ఆనాడు ఉదయం టెలి ప్రింటర్ ఆపరేటర్లుగా పనిచేసిన  శర్మ, శ్రీధర్,టి.వి.ఎన్. చారి,రమేష్ పాల్గొన్నారు.

-----

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు