ఆకేరు నదిలో కొట్టుకు పోయిన యువ శాస్త్రవేత్త -తండ్రి సైతం గల్లంతు

 


కుంభవృష్టి వర్షాలతో వాగులు పొంగి జనజీవనం అస్తవ్యస్థంగామారింది. పలువురు వాగుల్లో కొట్టుకు పోయారు. ఖమ్మం జిల్లాకుచెందిన ఓయువ శాస్ర్తవేత్త కారులో తండ్రితో కల్సి ఎయిర్ పోర్టుకు వెళ్తు వరద ఉధృతికి కారుతో సహా   ఆకేరు నదిలో కొట్టుకు పోయింది. 

 ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో ఢిల్లీలో యువ శాస్త్రవేత్త గా పనిచేస్తోంది. వ్యవసాయ మెలుకువల్లో జాతీయస్థాయిలో పలు బంగారు పథకాలు గెలుచు కుంది. 

తన సోదరుని ఎంగేజ్మెంట్ కోసం వచ్చి తిరిగివెళ్లే క్రమంలో ఆకేరునదిలో కొట్టుకు పోయింది.  ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారులో తన తండ్రి మోతీలాల్ తో కలిసి డోర్నకల్,చింతలపల్లి, మరిపెడ, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలనుకుని బయలు దేరగా అప్పటికే భారీవర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అయినా ఎట్లాగైనా వెళ్లాలని  తిరిగి వెళ్లే క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం హై లెవెల్ బ్రిడ్జి పై ఊహించని విధంగా ఆకేరు నది వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వరద ప్రవాహం లో కారు కొట్టుక పోయింది. రాత్రివేళ కావడంతో వరద ఉధృతి సరిగా పసిగట్టలేక వాగుదాటేక్రమంలో కారు కొట్టుకుపోయింది. 



 చివరి నిమిషాల్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన అశ్విని కారు కొట్టుకుపోతుంది మా..మెడ వరకు నీటిలో మునిగి పోయామంటూ సమాచారం ఇస్తూనే గల్లంతుఅయింది.  ఆమె నీట మునిగిపోవడంతో కొద్ది సెకండ్లలోనే ఫోన్ కట్ అయినట్టు వారి కుటుంబ సబ్యులు తెలిపారు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తెల్వారుజామున వారి కోసంపరిసరాల్లో గాలించగా చివరకు ఆదివారం  సాయంత్రం అక్కడికి కొద్దిదూరంలో  పామాయిల్ తోటలో మృతదేహం కనిపించింది. ఆ పక్కనే కారు సైతం కనపడింది. అయితే అశ్విని తండ్రి నునావత్ మోతిలాల్ఈప్రమాదంలోగల్లంతు అయ్యాడు. అతని కోసం విపత్తుసాహయక బృందాలు గాలిస్తున్నాయి.

మరోసంఘటనలో ఖమ్మం జిల్లాలో  బార్యభర్తలు ఇద్దరు గల్లంతు అయ్యారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు