కిట్స్ వరంగల్ కాంపస్ లో ప్రారంభమైన జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్-2024

 


కిట్స్ వరంగల్ లో  కాంపస్ లోప్రారంభమైన   టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి టోర్నమెంట్-2024 


 కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కిట్స్ వరంగల్-కిట్స్ డబ్ల్యు) లో జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్-2024 శనివారం ప్రారంభమయ్యాయి.   రెండు రోజుల పాటు ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈటోర్నమెంట్స్ ను  విద్యార్థులు, యువకులలో క్రీడా స్పూర్తిని పెంపొందించడం కోసం  నిర్వహిస్తున్నట్లు డిబ్ల్యు డి టి టి ఏ అధ్యక్షులు అకారపు హరిష్ తెలిపారు. ఈ టోర్నమెంట్స్ కు కిట్స్  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి కిట్స్ ముఖ్య అతిథిగా హాజరై  లాంఛనంగా ప్రారంభించారు.


 ఈ సందర్భంగా  ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ టేబుల్‌ టెన్నిస్‌ ఆడాలంటే సాంకేతిక, దృశ్య నైపుణ్యాలు మెండుగా ఉండాలన్నారు. ఇందులో ప్లేయర్ హ్యాండ్ గ్రిప్, రెడీ పొజిషన్, ఫుట్‌వర్క్, సర్వీస్ మరియు స్ట్రోక్‌లు ఇమిడి ఉంటాయని అన్నారు. ప్రజలలో శారీరక ఆరోగ్యం మరియు మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఆటలు మరియు క్రీడలు ముఖ్యమైన సాధనాలని  అందుకే కిట్స్ వరంగల్ కొత్త బి. టెక్‌ ప్రోగ్రాంఇంజనీరింగ్ పాఠ్యాంశాల లో గేమ్స్ క్రెడిట్ కోర్సును ప్రవేశపెట్టిందని వివరించారు.  


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  డబ్ల్యు డి టి టి ఏ అధ్యక్షులుఅకారపు హరీష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు  అకారపు హరీష్ మాట్లాడుతూ ఈ ఆటల పోటీలను వరంగల్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యు డి టి టి ఏ)వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ టోర్నమెంట్‌లో అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్ 19  బాల బాలికలకు  పురుషులు,  మహిళలకు రెండు రోజులలో ఆరు విభాగాలకు టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 47 జట్లతో సహా 130 మంది  క్రీడాకారులకు టేబుల్ టెన్నిస్ పోటీలు సింగిల్స్ మరియు డబుల్స్ పోటీలు నిర్వహిస్తారని   తెలిపారు. .


కిట్స్‌డబ్ల్యు డాక్టర్, నేత్ర వైద్య నిపుణులు, డాక్టర్ ఆర్.సుస్మిత, కిట్స్‌డబ్ల్యు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర డబ్ల్యుడిభిఎ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ పింగిళి రమేష్ రెడ్డి, డబ్ల్యుడిటిటిఎ ప్రధాన కార్యదర్శి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అతిథిగా డబ్ల్యుడిటిటిఎ జాయింట్ సెక్రటరీ డా. అజ్మీరా జై సింగ్, కార్యనిర్వాహక సభ్యులు కె. సునీల్ కుమార్,  కె.వెంకటస్వామి, యస్ మహేష్ వివిధ విభాగాల అధిపతులు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ  అసోసియేట్ ప్రొఫెసర్,పిఆర్‌ఓ, డా. డి.ప్రభాకరా చారి  పాల్గొన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు