లడ్డూ రాజకీయం.... వ్యాపార ఫాసిజం కొనసాగింపే



 లడ్డూ రాజకీయం....   వ్యాపార ఫాసిజం   కొనసాగింపే 

పెట్టుబడి దారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణన కాంక్షను ఊరి సరిహద్దు దాటిస్తాడని ,యాభై శాతం లాభం వస్తుందంటే వాడ దాటతాడనీ , 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, చిట్ట చివరకి తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చనిపోవడానికి గడియ కూడా ఆగడని ఆస్థిని కూడబెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో కార్ల్ మార్క్స్ రెండువందల ఏళ్ల కింద ఊహించాడు. పవర్ దానికి ఉన్న వికృతి, విశృంఖలత స్వభావాన్ని వివరించాడు.


 ఆయన ఈ వూహ చేసేనాటికి ప్రపంచం మొత్తం వలస పాలనలో ఉన్నప్పటికీ పెట్టుబడి ఇంత వికృతంగా లేదు. మతం ఇంత ప్రమాదకరంగా లేదు. ఫాసిజం కనీసం పుట్టలేదు. ఇప్పుడు పెట్టుబడి ఫాసిజం ముసుగు వేసుకుని రాజకీయాల లో రంకెలు వేస్తోంది. 

ఆంధ్రాలో పాలన మారింది. ప్రజల రాతలు మార్చాల్సిన నాయకుడు భక్తులు తిన్న లడ్డూలో  జంతు చర్మాలు కొవ్వులు ఉన్నాయని చెబుతున్నాడు. 


దాని అర్ధం స్వచ్చమైన నెయ్యి కావాలి. ఉన్న కాంట్రాక్టర్ ను మార్చి కొత్తవాన్ని పెట్టుకోవాలి. కల్తీ చేసినందుకు దేవస్థానంలో ఉన్న సంబంధిత మంత్రి అధికారులు బాధ్యులైన వాళ్ళను బొక్కలో వేయాలి. 


ఉప్పుడూ జులై 12 నాడు నెయ్యి సాంపిల్ తీసుకున్నావు. జులై 17 నాడు అది కల్తీ నెయ్యి అని తెలిసింది. తెలిసిన వెంటనే ఉన్న కొన్న నెయ్యి పారబోసి మన హెరిటేజ్ నెయ్యి ఇస్తే పోలా ? 


జులై లో సగం రోజులు ఆగస్ట్ మొత్తం సెప్టెంబర్ చివరి వారం దాకా జంతు కొవ్వు నెయ్యి నే తినిపించావు గా. గత పాలకులు తెలిసో తెలియకనో దొంగలు అయ్యారు. మరి తవరికి తెలిసాకా కూడా అదే నెయ్యి వాడుతున్నారు అంటే ఇక్కడ వ్యాపార ప్రయోజనాలు తప్ప మరో కథ లేదు. జగన్ పాలన లో నెయ్యి లో కొవ్వు ఉంటె. నీ పాలనలో కొవ్వు కొలిస్తే ఎట్ట బాజిరెడ్డి గారూ చూసుకోవద్దు ?


లడ్డూ లో కి వాడే నెయ్యి కోటాను కోట్ల వ్యాపారం.

వ్యాపారం ఉన్నకాడ.గడ్డి గాసం కొవ్వు ఎక్కడం సహజమే కదా ,.... ఎవరి కాలం లో.జరిగినా అది ఆక్షేపనీయమే 


 కొవ్వు అరగాల్సింది జగన్ కు కదా ఈ డిమాండ్ జగన్ అధికారం ఉన్నప్పుడు చేయాల్సింది  కదా ఏం జేద్దాం మరి ? 


వ్యాపారస్తుడు తన లాభం కోసమే బ్రతుకుతాడు.  అది పాలు అయినా పెరుగు అయినా నెయ్యి అయినా చిన్న లాజిక్. ఉన్న కాంట్రాక్టర్ ని తీసేసి దేశం కోసం ధర్మం కోసం కేవలం గడ్డి మాత్రమే తినే జంతువులనుండి పాలు తీసి నెయ్యి తీద్దాం. 


అన్నం తినాల్సిన కాంట్రాక్టర్ కొవ్వెక్కి గడ్డి తింటున్నాడు . లడ్డూ తినాల్సిన భక్తుడు గడ్డి తినమంటే తింటాడు గానీ కొవ్వు తినమంటే ఎలా మరి  చూసుకోబల్లా ??


అసలు కథ ఏమిటి అంటే 

మోడీ అనే వ్యాపారి రాబోయే మూడు రాష్ట్రాల ఎన్నికల కోసం లడ్డూ సహాయం అడిగాడు. తవరు ఒక చెయ్యేసారు

కొంత కాలం గుడి ఇంకొంత కాలం ఆవు ఇప్పుడు పవిత్రమైన లడ్డూ 

జనాలకు ఈ మాత్రం తెలియదా ??


డా గుఱ్ఱం సీతారాములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు