ముగిసిన టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్
రెండు రోజుల పాటు కిట్స్ వరంగల్ క్యాంపస్ లో జరిగిన టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగిసాయి. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమం లో పోటీలో విజేతలకు బహుమతులు అందచేశారు. పోలీస్ కమిషనరేట్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ. ఏ . మధుసూధన్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందచేశారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ ఆట చరిత్రను గుర్తు చేశారు. 19వ శతాబ్దం చివరలో, టేబుల్ టెన్నిస్ ఇంగ్లాండ్‌లో మొదటిసారి ప్రారంభ మైందని తెలిపారు. లాన్ టెన్నిస్ నుండి ప్రేరణతో ఇండూర్ గేమ్ గా అభివృద్ధి చేసారన్నారు. మొదటి ఆటగాళ్ళు విక్టోరియన్ సమాజానికి చెందిన మధ్యతరగతి వారని షాంపైన్ కార్క్‌ను బంతిగా, సిగార్ బాక్సులను బ్యాట్‌లుగా అట్లాగే నెట్ కోసం పుస్తకాలను ఉపయోగించి మొదటి గేమ్ ఆడేవారని తెలిపారు. టేబుల్ టెన్నిస్ ఆడటం వల్ల మానసిక తీక్షణత, రిఫ్లెక్స్, బ్యాలెన్స్, లెగ్, ఆర్మ్ మరియు కోర్ బలంతో పాటు ఏరోబిక్ ఫిట్‌నెస్ సాధించవచ్చని అన్నారు.
ఈ సందర్భంగాప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ మెదడును పదునుగా ఉంచుతుందన్నారు. హృదయ స్పందన సమతుల్యతను చేస్తుందని అంతేకాకుండా మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్ 19 బాల బాలికలకు మరియు పురుషుల, మహిళలకు సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు, ట్రోఫీలను పంపిణీ చేశారు. జిడబ్ల్యూఎంసీ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 100 మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు అని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డబ్ల్యుడిటిటిఎ అధ్యక్షులు & కిట్స్ వరంగల్ మేనేజ్‌మెంట్ సభ్యులు, ఆకారపు హరీష్, గౌరవ అతిధి గా కిట్స్‌డబ్ల్యు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర డబ్ల్యుడిభిఎ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ పింగిళి రమేష్ రెడ్డి, గౌరవ అతిధి గా డబ్ల్యు డి టి టి ఏ ఉపాధ్యక్షులు సునీల్ కుమార్, డబ్ల్యు డి టి టి ఏ ప్రధాన కార్యదర్శి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ యం. శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఫాకల్టీ, మహేష్, వెంకటస్వామి, హెడ్స్, డీన్లు, అధ్యాపకులు, సిబ్బంది తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, పి ఆర్ ఓ డా. డి. ప్రభాకరా చారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box