_ఆవేశమే సన్నివేశం!



 *_ఆవేశమే సన్నివేశం!_*

************************

సామాన్యుడే 

నా దేవుడన్నాడు

ఆ సామాన్యుడి కోసమే బతికిండు..

తాను అసమాన్యుడైనా గాని సామాన్యుడిగానే పోయిండు..

*_కాళోజీ.._*

ఈ పేరే 

తిరుగుబాటుకు నిర్వచనం..

ఆవేశానికి బహువచనం..

అక్షరంలోనైనా..

ఆహార్యంలోనైనా!


ఈ తెలంగాణ కవికి నివాళి

ఆ తెలంగాణ యాసలోనే

ఆ భాషలోనే రాద్దామనుకుంటే

అంతలోనే ఆయన మాటలే గుర్తుకొచ్చి మూసుకొని  తెలిసిన  పథంలోనే 

పద పదంటూ 

పరుగులెత్తింది ప్రతి పదం..

అలాగే అమరింది 

ప్రతి పాదం!

ఔను మరి..

*_ఎవడి వాడుక భాషలో_* 

*_వాడే రాయాలె.._*

*_ఇట్ట రాస్తే అవతలోడికి తెలుస్తదా..!_*

అని ముందే హెచ్చరించాడు పెద్దాయన..

ఇక ప్రయోగాల జోలికెళ్ళి 

ఏం ప్రయోజనం..!?


*_ఒక్క సిరాచుక్క_* 

*_లక్ష మెదళ్ళకు కదలిక.._*

మళ్లీ ఆ పెద్దాయన 

మాటలే స్ఫూర్తిగా 

ఆయన కాలాన్ని తలస్తూ

కలం కదిలింది..

ఆయన గురించి నాలుగు మాటలు రాద్దామంటే

మస్తిష్కం నిండా 

ఆయన మాటలే 

సుడులు తిరుగుతున్నాయి...

అలవాటు ప్రకారం

మద్దెలో నాలుగు 

ఎంగిలిపీసు ముక్కలు జొప్పసిస్తనేమోమని 

మా చెడ్డ భయం..

*_తెలుగు బిడ్డవురోరి_*

*_తెలుగు మాట్లాడుటకు_*

*_సంకోచపడెదవు_* 

*_సంగతేమిటిరా.._*

*_అన్యభాషలు నేర్చి_*

*_ఆంధ్రంబు రాదనుచు_* 

*_సకిలించు ఆంధ్రుడా_*

*_చావవేటికిరా.._*

ఇలా గద్దించిన కాళోజీ

మాటలు బుద్దెరిగి మసలితే

*_తెలుగోడు ఎప్పటికీ వెలుగోడే!_*


*కాళోజీ..ఉద్యమ ప్రతిధ్వని..*

*రాజకీయ సామాజిక* 

*చైతన్య సమాహారం..*

_*ఆయన ఓ ప్రశ్న..*_

*_ఆయనే జవాబు.._*

*_హక్కు ఆయన బుక్కు.._*

*_అదే ఆయన ధృక్కు.._*

*_ఇది నా గొడవ_* ని 

అనుకోక

*తుది విజయం మనది* అంటూ 

ఆ హక్కు కోసం 

మొదట తెల్లదొరలను..

పిదప నిజాములను

ఎదిరించిన శూరుడు..

*_మండే సూర్యుడు!_*


"""""""""""""""""""""""""""""""""""

ప్రజాకవి..పద్మవిభూషణ్

కాళోజీ నారాయణ రావు జయంతి

(09.09.1914)

సందర్భంగా

ప్రణామాలతో..

  

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

         9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు