పవర్ లిఫ్టర్ వంశీకి అభినందనలు

 


పవర్ లిఫ్టర్ వంశీకి అభినందనలు

 ఇటీవల యూరప్ లోని మాల్టా లో జరిగిన  అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్  ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి, అక్టోబర్ 4 నుండి 13 వరకు సౌత్ ఆఫ్రికాలో జరగబోతున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన అభివృద్ధి పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  కే శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి.....  అభినందించారు.

 ఈ సందర్భంగా స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, 

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించడానికి సమగ్రమైన నూతన క్రీడా విధానం

 రూపొందిస్తామన్నారు. ఒలంపిక్ క్రీడాంశాలతో పాటు ఇతర క్రీడాంశాలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చే విధంగా మార్గదర్శకత్వాలు రూపొందిస్తామని శివసేన రెడ్డి తెలిపారు.


భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన మోడెం వంశీ సౌత్ ఆఫ్రికాలోని కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్కు హాజరయ్యేందుకు" లేసినో "ఫౌండేషన్ చైర్మన్ పట్నం అనూష రెడ్డి లక్ష రూపాయల చెక్కును బహుకరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు